• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గర్భిణీలు, బాలింతలకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ

విజయనగరం ఘోష ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతిని పురస్కరించుకుని బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్, మాతృభూమి సేవా సంఘం మానవీయత చాటుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 250 మంది గర్భిణీలు, బాలింతలకు బిస్కట్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి బాజ్జీ, భోగవిల్లి వెంకట రమణ పాల్గొన్నారు.

April 14, 2026 / 07:14 PM IST

‘శతశాతం స్వీయ గణన నమోదు కావాలి’

PPM: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి మే 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ కార్యక్రమం జరగనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా దేశంలో తొలిసారిగా డిజిటల్ మోడ్‌లో ఈ నెల 16 నుంచి 30 వరకు se.census.gov.in పోర్టల్ నందు వ్యక్తిగతంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు.

April 14, 2026 / 07:14 PM IST

నిందితుడు ఆత్మహత్య…!

SKLM: పలాస మండలం మహాదేవిపురంలో విషాదం చోటుచేసుకుంది. జంట హత్యల కేసులో నిందితుడైన మడియా రామారావు (45) తన నివాసంలో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోంపేట మండలం పాలవలస, మందస మండలం దున్నవూరులలో జరిగిన జంట హత్యలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 14, 2026 / 07:12 PM IST

‘రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి’

AKP: నక్కపల్లి మండల కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలమంచిలి బైపాస్ నుంచి నక్కపల్లి మీదుగా పాయకరావుపేట తాండవ వంతెన వరకు జాతీయ రహదారిపై నిరంతరం జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. రహదారి నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలన్నారు.

April 14, 2026 / 07:11 PM IST

హెల్మెట్ వినియోగంపై పోలీసుల అవగాహన డ్రైవ్

బాపట్ల జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. “శిరో రక్షా–ప్రాణ రక్షా” నినాదంతో హెల్మెట్ వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుందని, ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

April 14, 2026 / 06:55 PM IST

‘జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనే లక్ష్యం’

BPT: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన ధ్యేయంగా బాపట్ల పోలీసులు ప్రత్యేక నిఘా సారించారు. జిల్లా ఎస్పీ బీ.ఉమామహేశ్వర్ (IPS) పర్యవేక్షణలో మంగళవారం పలు జూద స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. రహస్య సమాచారం మేరకు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ రైడ్లలో పలువురు జూదగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

April 14, 2026 / 06:42 PM IST

‘పీఎం సూర్య ఘర్’ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కార్యక్రమాన్ని గుంటూరు 21వ డివిజన్ యతిరాజుల కాలనీలో ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు పున్నమ్మ కుటుంబానికి తొలి సోలార్ ప్యానెల్స్‌ను ఎమ్మెల్యే అందజేశారు.

April 14, 2026 / 06:40 PM IST

‘దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు అమూల్యమైనవి’

CTR: కుప్పం డీఎస్పీ కార్యాలయంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్క‌ర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శ్రీ పార్థసారథి కార్యాలయ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.

April 14, 2026 / 06:40 PM IST

‘డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయించాలి’

ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని TDP ఇంఛార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ, మంత్రి నారా లోకేష్‌ను కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. కాలేజీకి భవనాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించగా మంత్రి సానుకూలంగా స్పందించారు.

April 14, 2026 / 06:39 PM IST

ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని పాదయాత్ర

ELR: వేలేరుపాడు (మం) బండ్ల బోరు గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో మండల సమావేశం మంగళవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కారం దారయ్య మాట్లాడుతూ.. ఈనెల 17న పెద్ద వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చేస్తున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అనేక లాభాలు కలుగుతాయని వివరించారు.

April 14, 2026 / 06:38 PM IST

‘భూములు వదులుకొనే ప్రసక్తే లేదు’

AKP: ప్రభుత్వం తమకు ఇచ్చిన అసైన్డ్ భూములను వదులుకునే ప్రసక్తే లేదని రాంబిల్లి మండలం పంచదార్లకు చెందిన దళిత రైతులు స్పష్టం చేశారు. భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మంగళవారం విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత రైతులు ర్యాలీ నిర్వహించారు. తామంతా కుటుంబాలతో ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు.

April 14, 2026 / 06:37 PM IST

అంబేద్కర్ బొమ్మ గీసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

NLR: రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిక్సూచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ఉదయగిరి మండలం పుల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి బొమ్మ గీసి పలువురిని అబ్బుర పరిచింది. రెండో తరగతి చదువుతున్న గాజులపల్లి చక్షిత్ రెడ్డి ఆ మహానీయుడు బొమ్మను చిత్రలేఖనం చేయడంపై పలువురు అభినందనలు తెలిపారు.

April 14, 2026 / 06:36 PM IST

గుడిపాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

CTR: గుడిపాల(M) లో టీడీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే తండ్రి, జీజేఎం డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు అంబేద్క‌ర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. స్థానిక నేతలతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 06:35 PM IST

పిడుగురాళ్లలో అగ్నిమాపక వారోత్సవాలు

PLD: పిడుగురాళ్లలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఈనెల 14 నుంచి 20 వరకు జరుగుతాయి. తొలిరోజు అగ్నిమాపక అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ సీఐ వెంకటరావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రమాద నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. బుధవారం పెట్రోల్ బంకులు, గోడౌన్లు, మాల్స్‌లో ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తామని ఫైర్ ఆఫీసర్ కే.శ్రీనివాసరావు తెలిపారు.

April 14, 2026 / 06:35 PM IST

నార్పలలో జెండర్ వనరుల కేంద్రం ప్రారంభం

ATP: నార్పల మండల కేంద్రంలో జెండర్ వనరుల కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రారంభించారు. మహిళలకు చట్టపరమైన సాయం, కౌన్సెలింగ్, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రం కృషి చేస్తుందని ఆమె తెలిపారు. పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం గ్రామ సంఘ సహాయకులకు 200 స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు.

April 14, 2026 / 06:30 PM IST