• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వీడియో కాల్ మోసంపై ఎస్పీ హెచ్చరిక

ప్రకాశం: జిల్లా SP హర్షవర్ధన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొందరు మోసగాళ్లు పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్ చేసి మీరు అరెస్ట్‌లో ఉన్నారని భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఇటువంటి కాల్స్ నమ్మకుండా వెంటనే కట్ చేయాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఇవ్వకూడదన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలని అన్నారు.

April 8, 2026 / 06:30 PM IST

న్యాయవాది హత్యపై బార్ అసోసియేషన్ ఆగ్రహం

TPT: అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం వడ్డీపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యపై సత్యవేడు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సెక్రటరీ రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు.

April 8, 2026 / 06:26 PM IST

మహిళ మృతదేహం లభ్యం

SS: హిందూపురం రూరల్ మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రూరల్ అప్‌గ్రేడ్ సీఐ చంద్రాంజనేయులు ఘటన స్థలానికి చేరుకుని పూర్తిగా కాలిపోయిన మహిళ శవాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు

April 8, 2026 / 06:23 PM IST

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు

NTR: జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నేపాగ సుందర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య నియమాలు పాటించాలని, వ్యాయామం, పౌష్టికాహారం అవసరమని సూచించారు. ఆసుపత్రి సౌకర్యాలను పరిశీలించారు.

April 8, 2026 / 06:20 PM IST

‘రైతులకు ఆధునిక పరికరాలు’

VZM: జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అందిచటమే లక్ష్యమని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం మినిస్టరీ ఆఫ్ పవర్ అనుబంధ సంస్థ ఈఈఎస్ఎల్ (EESL) ప్రతినిధులతో డీసీసీబీ కార్యాలయంలో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డీసీసీబీ-ఈఈఎస్ఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలు (MOUలు) చేసుకున్నామని తెలియజేశారు.

April 8, 2026 / 06:15 PM IST

బస్సు-ఆటో ఢీకొని.. ఒకరు మృతి

KRNL: ఆలూరు మారెమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈడిగ మునెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 8, 2026 / 06:13 PM IST

బస్సు-ఆటో ఢీకొని ఒకరు మృతి

KRNL: ఆలూరు మారెమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈడిగ మునెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 8, 2026 / 06:13 PM IST

భూసేకరణపై అభ్యంతరం

AKP: రాంబిల్లి మండలం జెడ్.చింతువ, ఎం.చింతువ గ్రామాల పరిధిలో పరిశ్రమల కోసం భూసేకరణ పనులు చేపడుతుండడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు పూర్తి శాతం పరిహారం చెల్లించి గ్రామాలను తరలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్వహించకుండా భూసేకరణ చేయరాదన్నారు.

April 8, 2026 / 06:13 PM IST

గిరిజన విద్యా సదస్సు పోస్టర్ ఆవిష్కరణ

ASR: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు పోస్టర్‌ను బుధవారం చిలకలగెడ్డ ఆశ్రమ పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సదస్సు ఏప్రిల్ 12న రంపచోడవరంలో నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యమని చెప్పారు.

April 8, 2026 / 06:13 PM IST

‘మద్దతు ధర కల్పనలో ప్రభుత్వం విఫలం’

SKLM: కూటమి ప్రభుత్వం మొక్క జొన్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమయిందని మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండలం మహంతిపాలెం గ్రామంలో బుధవారం గ్రామ కమిటీల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

April 8, 2026 / 06:13 PM IST

వీ.కోటలో ఎమ్మెల్యే పర్యటన

CTR: వీ.కోట మండలంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గోనమాకులపల్లి, కృష్ణాపురం పంచాయతీల్లో సుమారు రూ.2 కోట్ల అభివృద్ధి పనులను, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లో సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ వంటి సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.

April 8, 2026 / 06:05 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.63 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,63,625 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 134 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 23 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1620 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.

April 8, 2026 / 06:02 PM IST

మహిళా రైతును అభినందించిన కలెక్టర్

SS: ఆమడగూరు మండలం జౌకల కొత్తపల్లికి చెందిన మహిళా రైతు గజ్జల శ్రీదేవి చీయా పంట సాగుతో మంచి లాభాలు పొందారు. 1.30 ఎకరాల్లో సాగు చేసి 11 క్వింటాల దిగుబడి సాధించి, క్వింటాకు రూ.14,000 చొప్పున మొత్తం రూ.1,54,000 ఆదాయం పొందారు. రూ.15,000 పెట్టుబడితో రూ.1,39,000 నికర లాభం పొందిన ఆమెను పుట్టపర్తి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అభినందించారు.

April 8, 2026 / 06:02 PM IST

తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NLR: వలేటివారిపాలెం తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోనని అర్జీదారులకు సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీతో కలిసి రికార్డు రూమ్ విభాగాలను పరిశీలించి భూసేకరణ పరిహారం చెల్లింపులపై సమీక్షించారు.

April 8, 2026 / 06:02 PM IST

కొండపి వైద్యశాలలో పనులు పరిశీలించిన మంత్రి స్వామి

ప్రకాశం: కొండపిసామాజిక ఆరోగ్యకేంద్రంలో జరుగుతున్న మరమ్మతు పనులను బుధవారం మంత్రి స్వామి పరిశీలించారు. వైద్యశాలను ప్రత్యేక శ్రద్ధతో పలు రకాల అభివృద్ధితో పాటు వసతులు కల్పించేందుకు మంత్రి కృషి చేస్తున్నారు. కొండపిలో వైద్యశాలకు ఇప్పటికే డయాలసిస్ యూనిట్ మంజూరు చేయించారు. మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 8, 2026 / 06:00 PM IST