NLR: వలేటివారిపాలెం తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోనని అర్జీదారులకు సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీతో కలిసి రికార్డు రూమ్ విభాగాలను పరిశీలించి భూసేకరణ పరిహారం చెల్లింపులపై సమీక్షించారు.