• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గిరిజన పీజీఆర్ఎస్‌కు 7 వినతులు

PPM: గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా ఐటీడీఏ పనిచేస్తుందని జాల్లా ఐటీడీఏ ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాల్‌లో నిర్వహించిన గిరిజన సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ఏడుగురు గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు.

April 10, 2026 / 05:58 PM IST

వ్యవసాయ శాఖ ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం

ప్రకాశం: మర్రిపూడిలో వ్యవసాయశాఖ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యాలయంకు పలువురు అనేక పనులు నిమిత్తం వస్తుంటారని అన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నందున రైతులుకు కూడా చల్లని కుండనీరును అందించాలని చలివేంద్ర ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

April 10, 2026 / 05:58 PM IST

ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాలి: సీఐటీయూ

AKP: పరవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ పరవాడలో పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి 1.43 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఏడాది కావస్తున్న నిర్మాణ పనులు చేపట్టలేదని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి అన్నారు.

April 10, 2026 / 05:49 PM IST

తంటికొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

E.G: గోకవరం మండలం తంటికొండ గ్రామంలో రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భరత్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తంటికొండ గ్రామానికి చెందిన రైతులు అందరూ రైతు సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని, తమ పంటలకు సరైన ధర పొందాలని సూచించారు.

April 10, 2026 / 05:45 PM IST

నూతన వంతెన నిర్మాణంపై ఎమ్మెల్యే సమీక్ష

కాకినాడ బీచ్ రోడ్‌లోని కుంభాభిషేకం రేవు వద్ద నూతనంగా నిర్మించబోయే వంతెన నిర్మాణ పనులపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సంబంధిత అధికారులతో ఇవాళ సమగ్ర సమీక్ష నిర్వహించారు. వంతెన నిర్మాణం నాణ్యతగా, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మత్స్యకారులకు వారి వృత్తిలో ఎటువంటి అవరోధాలు కలుగకుండా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు.

April 10, 2026 / 05:40 PM IST

66వ రోజుకు చేరిన దళిత రైతుల నిరసన దీక్షలు

AKP: అన్యాయం చేయవద్దంటూ దళిత రైతులు రాంబిల్లి మండలం పంచదార్ల వద్ద చేపట్టిన నిరసన దీక్షలు ఇవాళ 66వ రోజుకు చేరుకున్నాయి. తమ భూములు లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నో ఏళ్ల నుంచి మామిడి, జీడి తోటలను సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగుల విభాగం ప్రతినిధులు రాము పాల్గొన్నారు.

April 10, 2026 / 05:38 PM IST

గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

W.G: పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో కాలనీ సంబంధించి గ్రావెల్ రోడ్డులు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ పాల్గొన్నారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 10, 2026 / 05:33 PM IST

‘చెత్త నిర్వహణలో సాంకేతికతను వినియోగించండి’

KRNL: కర్నూలు నగర శివారులోని గార్గేయపురం డంపింగ్ యార్డ్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఇవాళ సందర్శించారు. నగర కమిషనర్ విశ్వనాథ్, ఆర్డీవోలతో కలసి చెత్తను శాస్త్రీయ విధానంలో డీ కంపోజ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా యార్డ్‌లో అమలవుతున్న నిర్వహణ పద్ధతులను అధికారులతో సమీక్షించి, మరింత మెరుగైన చర్యలు చేపట్టాలని సూచించారు.

April 10, 2026 / 05:30 PM IST

పొరపాటున నోరు జారిన నెల్లూరు మేయర్

నెల్లూరు 45వ డివిజన్ పెద్ద కాలువ వద్ద డ్రోన్‌తో దోమల మందు కొట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. పొరపాటున నోరు జారారు. ‘రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి, పొంగూరు నారాయణ’ అనాల్సింది “రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి” అని అన్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

April 10, 2026 / 05:30 PM IST

బోటు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే

కృష్ణా: నాగాయలంక మండలం ఎదురుమొండిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మత్స్యకారులకు బోటు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలను శుక్రవారం అందచేశారు. సముద్రంలో చేపల వేటకు అనువుగా ఎదురుమొండి పరిధిలోని అరవై మంది మత్స్యకారులకు ఈ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ నాగరాజా, ఎఫ్.డీ.వో సత్యనారాయణ, ఫిషరీస్ కో-ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షులు చెన్ను వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

April 10, 2026 / 05:28 PM IST

మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ స్పీకర్

SKLM: వైఎస్‌ఆర్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆమదాలవలస తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై బురద చల్లడం అచ్చెన్నాయుడి దిగజారుడుతనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజల గుండెల్లో వైఎస్‌ఆర్ చిరస్మరణీయమన్నారు.

April 10, 2026 / 05:27 PM IST

ఆసుపత్రికి అంబులెన్స్ బహుకరణ

ELR: చెబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా గుండుగొలను తిరుమల పాల డైరీ యాజమాన్యం ఆసుపత్రి వైద్యాధికారులకు అంబులెన్స్‌ను అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సార్థకంగా అమలవుతోందనీ ఎమ్మెల్యే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు కోసం అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

April 10, 2026 / 05:26 PM IST

సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్: ఎమ్మెల్యే

ASR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ‘ప్రజా దర్బార్’ అని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. శుక్రవారం ఆమె పాడేరుల క్యాంపు కార్యాలయంలో అర్జీలు స్వీకరించారు. తాగునీరు, పెన్షన్లు, డ్రైనేజీ సమస్యలపై వచ్చిన వినతుల్లో కొన్నింటిని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అధికారులకు సిఫారసు చేశామన్నారు.

April 10, 2026 / 05:26 PM IST

అడ్వకేట్ మిస్సింగ్ పై కేసు నమోదు

KDP: మైలవరం పోలీస్ స్టేషన్‌లో దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన అడ్వకేట్ పల్లా బాలుగ్రం మిస్సింగ్ ఘటనపై కేసు నమోదు అయింది. ఈ నెల 6వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య సుదర్శన దేవి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని మైలవరం ఎస్సై కోరారు.

April 10, 2026 / 05:25 PM IST

ప్రజాదర్బార్ నిర్వహించిన ప్రభుత్వ విప్

PPM: గుమ్మలక్ష్మీపురంలో కురుపాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల నుంచి హాజరైన ప్రజలు తమ గ్రామాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యేకు వినతి రూపంలో అందజేసి వివరించారు. పలు అంశాలపై ప్రజలు తమ ఆవేదనను తెలియజేశారు.

April 10, 2026 / 05:24 PM IST