• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఏఐటీయూసీ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో కార్యవర్గం ఎన్నిక అయ్యిందని ఏఐటీయూసీ నూతన ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఇవాళ కాకినాడలో పాత్రికేయుల సమావేశంలో ప్రసాద్ నూతన నాయకత్వాన్ని పరిచయం చేశారు. అధ్యక్షులుగా తాటిపాక మధు, ఉపాధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొబ్బిలి శ్రీనివాసరావు నియమితులయ్యారని వెల్లడించారు.

April 12, 2026 / 01:39 PM IST

ప్రశాంతంగా ముగిసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

SKLM: పోలాకి మండలం ఈదులవలస ఏపీ మోడల్ పాఠశాల ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని ప్రిన్సిపల్ పైడి ప్రవీణ తెలియజేశారు. 344 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 332 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. నరసన్నపేట మండల విద్యాశాఖ అధికారి యు. శాంతారావు పరీక్షను పర్యవేక్షించారు

April 12, 2026 / 01:27 PM IST

వినతుల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

SS: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను కలిసి తమ సమస్యలపై వినతులు అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు తమ విజ్ఞప్తులను ఆమెకు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.

April 12, 2026 / 01:21 PM IST

విద్యార్థులకు క్విజ్ పోటీల నిర్వహణ

ATP: గుత్తి రైల్వే ఎస్సీ, ఎస్టీ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు ఇవాళ క్విజ్ కాంపిటేషన్ పోటీలు నిర్వహించారు. క్విజ్ పోటీల నిర్వాహకులు మనోజ్ మాట్లాడుతూ.. ఈనెల 14న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులకు ఈ క్విజ్ పోటీలను నిర్వహించామన్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జయంతి రోజున బహుమతులను అందజేస్తామన్నారు.

April 12, 2026 / 01:20 PM IST

దామోదర్ నాయుడును పరామర్శించిన ఎమ్మెల్యే

CTR: నగరి మండలం వి.కె.ఆర్ పురానికి చెందిన దామోదర్ నాయుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా, ఆయనను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇవాళ స్వగృహంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతో పాటు నాయకులు, కార్యకర్తలు వచ్చారు.

April 12, 2026 / 01:19 PM IST

ఒంగోలులో రేపు మీకోసం కార్యక్రమం

ప్రకాశం: రేపు ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

April 12, 2026 / 01:19 PM IST

మినీ రైస్ మిల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలం బెజ్జిపురం–తమాడ రోడ్డులో ఏర్పాటు చేసిన శ్రీలలిత మోడ్రన్ మినీ రైస్ మిల్‌ను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిశ్రమలు అభివృద్ధికి దోహదం చేస్తాయని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.

April 12, 2026 / 01:18 PM IST

గ్రంథాలయ జనరల్ బాడీ సమావేశం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ శాఖా గ్రంధాలయం జనరల్ బాడీ సమావేశం ఛైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతనలో ఇవాళ జరిగింది. గ్రంధాలయాన్ని గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ వన్‌గా మార్చాలని ఒక తీర్మానాన్ని చేశారు. గ్రంధాలయానికి పాఠకుల సంఖ్య పెంచాలనేది లక్ష్యాన్ని పెట్టుకున్నామని, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.

April 12, 2026 / 01:18 PM IST

ఈనెల 15న స్కిట్ కాలేజీలో జాబ్ మేళా

TPT: APSSDC ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన శ్రీకాళహస్తిలోని SKIT కాలేజీలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఇవాళ జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీసిటీ, మేనకూరు, రేణిగుంట క్లస్టర్‌తో పాటు చెన్నై, బెంగళూరుకు చెందిన 30 MNC కంపెనీల ప్రతినిధులు రానున్నారు. 2వేలకు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు naipunyam.ap.gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలి.

April 12, 2026 / 01:14 PM IST

ఎమ్మిగనూరులో ట్రాఫిక్ జామ్ సమస్య

KRNL: ఎమ్మిగనూరులోని కమిటీ రోడ్డు కూడలిలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటుగా వెళ్తున్న సీఐ శ్రీనివాస్ నాయక్ ట్రాఫిక్‌ను స్వయంగా మళ్లించారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైన్‌లు వేయడానికే పరిమితమవుతున్నారని వాహనదారులు ఇవాళ విమర్శిస్తున్నారు.

April 12, 2026 / 01:14 PM IST

‘ప్రశాంతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవాలి’

GNTR: పొన్నూరులో ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ వీరానాయక్ కోరారు. ర్యాలీల్లో డీజేలు వాడటంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా వివాదాస్పద నినాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వేడుకల్లో ట్రాఫిక్ మళ్లింపు దృష్ట్యా వాహనదారులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన సూచించారు.

April 12, 2026 / 01:11 PM IST

యువకుని మృతదేహం తెప్పించేందుకు మంత్రి చర్యలు

VZM: అమెరికాలో నిన్న జలపాతంలో మునిగి మరణించిన బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ ( 26 ) మృతదేహాన్ని సొంత గ్రామానికి తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రమాదంలో మరణించడం కలిచి వేసిందన్నారు.      

April 12, 2026 / 01:10 PM IST

ఇంటర్ ఫలితాల్లో జస్వంత్ సాయి ప్రతిభ

ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో కళ్యాణదుర్గం టీడీపీ నేత పాలబండ్ల హనుమంత రెడ్డి కుమారుడు జస్వంత్ సాయి అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. జస్వంత్ సాయి సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

April 12, 2026 / 01:10 PM IST

గజ ఈతగాళ్లకు పంచాయతీ షాక్

బాపట్ల: సూర్యలంకలోని 15 మంది గజ ఈతగాళ్లకు అడవి గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసింది. నిధుల లేమితో జీతాలు ఇవ్వలేమని చేతులెత్తేసింది. సముద్రంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన తమ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందని ఈతగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఉద్యోగాలు తీసేస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

April 12, 2026 / 01:04 PM IST

ఐపీఎల్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు

CTR: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్, అక్రమ లాటరీలు, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచి ప్రత్యేక దాడులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాచారం ఇవ్వాలని సూచించారు.

April 12, 2026 / 01:03 PM IST