• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

TPT: నాయుడుపేట వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకులు మద్దాల సోమశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

April 5, 2026 / 07:21 PM IST

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ASR: అడ్డతీగల మండలం కొనలోవ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ఆదివారం సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

April 5, 2026 / 07:14 PM IST

‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలి’

AKP: జగ్జీవన్ రామ్ పేరుతో నిర్మించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని సీపీఐ పాయకరావుపేట మండల కార్యదర్శి వి. అర్జున్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శబరి కాలనీలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయగా బడ్జెట్‌లో రూ. 600 కోట్లు కేటాయించారన్నారు.

April 5, 2026 / 07:12 PM IST

అనపర్తిలో అమరావతి ముగ్గు

E.G: ప్రతి ఇంటి ముందు సాధారణంగా మహిళలు ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులతో సాంప్రదాయ వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని తెలియజేస్తుంది. అమరాతి చట్టబద్దత బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన సందర్భంగా ఆదివారం అనపర్తి నియోజకవర్గం రామవరంలో “మన రాజధాని మన అమరావతి” అంటూ మహిళనె ముగ్గులు వేశారు. ఎంతోమంది ఈ ముగ్గును ఆసక్తిగా తిలకించారు.

April 5, 2026 / 07:10 PM IST

కొండ్రముట్లలో ఉచిత మెగా వైద్య శిబిరం

PLD: ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఈ శిబిరాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. పల్లెల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.

April 5, 2026 / 07:00 PM IST

హత్య కేసులో నిందితుల అరెస్ట్

CTR: తవణంపల్లి మండలంలో యువకుడి హత్య కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు యువరాజ్(18)తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వివాదం కారణంగా 01-04-2026న కొత్త చెరువు వద్ద లవకుమార్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 03-04-2026న కేసు నమోదు చేసి, 05-04-2026న తెలగుండ్లపల్లి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

April 5, 2026 / 07:00 PM IST

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి పై సంకటహర చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. ఆర్జిత సేవల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రద్దీ నియంత్రణకు రూ.500 టికెట్లు, అంతరాలయ దర్శనం నిలిపివేశారు. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈవో శీనానాయక్ పరిశీలించి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

April 5, 2026 / 07:00 PM IST

బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం

ప్రకాశం: రాయవరం బస్సు ప్రమాదంలో మరణించిన కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి పంచాయతీ మండాదిరివారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రమాదేవి కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం పరామర్శించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 5, 2026 / 07:00 PM IST

యాదవుల బజార్‌లో తాగునీటి కోసం బోర్ ప్రారంభం

BPT: సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరు పంచాయతీ పరిధిలోని యాదవుల బజార్ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజు బోర్ తవ్వక పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ బోర్ తవ్వకం పూర్తయిన అనంతరం ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు.

April 5, 2026 / 07:00 PM IST

క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు కొబ్బరితోట ప్రాంతానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు చింతల సత్యను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఈ మేరకు ఆమె అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు, బియ్యం బస్తా అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

April 5, 2026 / 07:00 PM IST

పిడుగుపాటుతో గీత కార్మికుడు మృతి

TPT: శ్రీకాళహస్తి మండలం కలవగుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటికల్లు గీస్తున్న సమయంలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో గీత కార్మికుడు వీ. కామరాజ్ (35) కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే ఆయనను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఏర్పేడు మండలం పరమాలపల్లి గ్రామానికి చెందినవాడు.

April 5, 2026 / 06:57 PM IST

ఘనంగా జగ్జవన్ రామ్ జయంతి వేడుకలు

W.G:పెంటపాడు మండలం ఉమామహేశ్వరం, కె. పెంటపాడు, రాచర్ల, ప్రత్తిపాడు, పట్టింపాలెం గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వల బాబ్జీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.

April 5, 2026 / 06:41 PM IST

ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

 తిరుపతి నగరంలోని పద్మావతి పార్క్‌లో ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. 35 లక్షలతో పార్క్‌ను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలోని పది పార్కులకు మౌలిక సదుపాయాలు కల్పించమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పద్మావతి పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

April 5, 2026 / 06:34 PM IST

‘సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగ్జీవన్ రామ్’

NTR: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి,, టీడీపీ నాయకులు చలసాని రమణ, బెజవాడ నజీర్ తదితరులు ఫాల్గొన్నారు.

April 5, 2026 / 06:31 PM IST

సైక్లింగ్‌లో మౌలాబికి సిల్వర్ పతకం

NDL: అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మౌలాబి ప్రతిభ కనబరిచి మూడో స్థానం సాధించింది. ఈ విజయంతో ఆమెకు సిల్వర్ పతకం లభించింది. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఇవాళ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో పాల్గొని బంగారు పతకం సాధించడం తన లక్ష్యమని మౌలాబి పేర్కొన్నారు.

April 5, 2026 / 06:28 PM IST