తిరుపతి నగరంలోని పద్మావతి పార్క్‌లో ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. 35 లక్షలతో పార్క్‌ను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలోని పది పార్కులకు మౌలిక సదుపాయాలు కల్పించమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పద్మావతి పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.