• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

ATP:పెద్దవడుగూరు మండలంలోని జి. వెంకటాంపల్లి గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు. ఒక జేసీబీని సీజ్ చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాలను తహసీల్దారు ఉషారాణికి అప్పగించినట్లు తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి,ఇసుక తరలిస్తే చర్యలు తప్పవన్నారు.

April 19, 2026 / 07:10 AM IST

చందనోత్సవానికి అనకాపల్లి నుంచి ప్రత్యేక బస్సులు

AKP: సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణా అధికారిణి(ఆర్టీసీ) వి. ప్రవీణ తెలిపారు. డిపో నుంచి ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి డిపో నుంచి బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇక్కడి నుంచి 15 బస్సులు నడుపుతామన్నారు.

April 19, 2026 / 07:06 AM IST

‘అర్హత గల ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇవ్వాలి’

VZM: ఉపాధ్యాయులకు యాప్‌ల భారం, ఆన్ లైన్ల భారం తగ్గించాలని APTF జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్ మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్దానిక కలెక్టరేట్‌ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ZP పాఠశాలకు HM పోస్ట్‌ మంజూరు చేయాలని, అర్హత కలిగిన ఉపాధ్యాయులకు జూనియర్‌ లెక్పరర్‌గా ప్రమోషన్‌ ఇవ్వాలన్నారు.

April 19, 2026 / 07:06 AM IST

రేపు నంద్యాలలో PGRS: కలెక్టర్

NDL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్లైన్లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లా వాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 19, 2026 / 07:04 AM IST

ఏలూరు ఇండియన్ బ్యాంకులో సీబీఐ సోదాలు

ఏలూరు ఎన్.ఆర్.పేటలోని ఇండియన్ బ్యాంకులో శనివారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బ్యాంకు గోల్డ్ అప్రెజర్ కృష్ణ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. కాగా రాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.

April 19, 2026 / 07:02 AM IST

TDP నేతకు మంత్రి నివాళులు

ప్రకాశం: పొన్నలూరు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లపనేని కోటేశ్వరరావు(58) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. గతంలో ఆయన మండల యూత్ అధ్యక్షుడిగా పనిచేశారు. కోటేశ్వరరావు మృతి విషయం తెలుసుకున్న మంత్రి స్వామి ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి అన్నారు.

April 19, 2026 / 07:00 AM IST

నేడు ఉచిత గుండె వైద్య శిబిరం

కడప: కమలాపురం పట్టణంలోని శిరీష శ్రీసాయి ఆసుపత్రిలో అనంతరంకు చెందిన కిమ్స్ సవేరా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. గుండె జబ్బులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

April 19, 2026 / 06:48 AM IST

రేప్ కేసు.. పదేళ్ల జైలు శిక్ష

NLR: నెల్లూరు రూరల్ కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య (45) తన పిల్లలకు పెళ్లిళ్లు చేసి, తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. అక్క కుమార్తె (16)ని 2021లో ఇంటికి తీసుకెళ్తున్నట్లు నమ్మించి వివాహం చేసుకొని అత్యాచారం చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం విచారించిన కోర్టు నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

April 19, 2026 / 06:45 AM IST

‘చందనోత్సవానికి ప‌టిష్ట భ‌ద్ర‌త‌’

VSP: చందనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్టు సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చి తెలిపారు. మొత్తం 2,800 మంది సిబ్బందిని రంగంలోకి దించి, కొండపై , దిగువ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను కొండ దిగువనే పార్క్ చేసి, దేవస్థానం బస్సుల ద్వారానే పైకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

April 19, 2026 / 06:39 AM IST

వేంకటేశ్వర ఫుడ్స్ కంపెనీపై కేసు

ATP: బుక్కరాయసముద్రంలోని వేంకటేశ్వర ఫుడ్స్ కంపెనీపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అనంతపురానికి చెందిన రేవంత్ గుప్తా, శశి 15 ఏళ్లుగా ‘రామ్’ పేరుతో పొద్దుతిరుగుడు విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. సదరు కంపెనీ యజమాని వెంకటకిశోర్ అదే పేరుతో నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

April 19, 2026 / 06:37 AM IST

అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష

VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం కలక్టరేట్లో పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై అదికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్‌ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 19, 2026 / 06:35 AM IST

అనారోగ్యంతో అంగన్వాడీ కార్యకర్త మృతి

NDL: చాగలమర్రిలోని బుగ్గరస్తాలో గల 5వ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న పద్మావతి (60) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలోని పలువురు అంగన్వాడీ టీచర్లు శనివారం ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐసీడీఎస్ సీడీపీవో తేజేశ్వరి, సూపర్వైజర్ సుశీల వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

April 19, 2026 / 06:30 AM IST

సూసైడ్‌కు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ప్రకాశం: జిల్లాలో బీటెక్ విద్యార్థి శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పొదిలి మండలం గోగినేనివారిపాలెంకు చెందిన ఈ యువకుడు, అంతకుముందు తన తమ్ముడికి ఫోన్ చేసి ‘నేను చనిపోతున్నాను’ అని చెప్పాడు. ఆందోళన చెందిన తమ్ముడు వెంటనే చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన చీమకుర్తి సీఐ, ఎస్సై ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలించి, విద్యార్థి ప్రాణాలను కాపాడి అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 19, 2026 / 06:30 AM IST

గడ్డివాములు దగ్ధం

KRNL: గోనెగండ్లలోని బీసీ కాలనీలో శనివారం ప్రమాదవశాత్తు నిప్పుఅంటుకొని 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.75వేల నష్టం వాటిల్లినట్లు బాధిత మహిళా రైతు బోయ లక్ష్మి తెలిపారు. గడ్డివాము పై బాగంలో విద్యుత్ తీగలు ఉన్నాయి. తీగల నుంచి నిప్పరవ్వలు గడ్డి వాములపై పడటంతో వాములు రెండు కాలిపోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

April 19, 2026 / 06:30 AM IST

H1V నివారణ జిల్లాగా తీర్చిదిద్దుదాం: DMHO

NLR: జిల్లాలో బీవీనగర్ లోని DFIT కార్యాలయంలో H1V/ఎయిడ్స్ పై DMHO వి.సుజాత, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఖాదర్ వలీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. H1V నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో కేసులను గుర్తించి స్వచ్ఛంద సంస్థలు మరింత మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

April 19, 2026 / 06:27 AM IST