ప్రకాశం: జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను ఈ నెల 25వ తేది వరకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్ తెలిపారు. డీఎస్సీ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న వారికి మూడు నెలలపాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సదుపాయం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.