»Rs 13 Lakh Crores Investment From Global Summit Ys Jagan
Visakha Global Simmit: రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల రాక
గ్లోబల్ ఇన్వెషస్ట్ మెంట్ సదస్సు (Global investment summit) మొదటి రోజు 13 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ys jagan) వెల్లడించారు. ఈ మేరకు 340 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు పెట్టుబడుల కోసం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను శుక్రవారం ప్రారంభించింది.
గ్లోబల్ ఇన్వెషస్ట్ మెంట్ సదస్సు (Global investment summit) మొదటి రోజు 13 లక్షల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( ys jagan) వెల్లడించారు. ఈ మేరకు 340 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 20 రంగాల్లో పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు పెట్టుబడుల కోసం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను శుక్రవారం ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తదితరులు వచ్చారు. దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జగన్ చివరలో మాట్లాడారు. మొదటి రోజు రూ.11.85 లక్షల కోట్లకు సంబంధించి 92 ఎంవోయులు కుదిరాయని, రెండో రోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 248 ఎంవోయులు కుదరన్నట్లు చెప్పారు. రిలయన్స్, అదానీ, ఆదిత్య బిర్లా, రెన్యు పవర్,అరబిందో, జిందాల్, శ్రీ సిమెంట్స్, మొండలీస్ తదితర కంపెనీలు వచ్చాయి. పరిశ్రమల ఏర్పాటుకు, విస్తరణకు అనువైన వాతావరణం ఉందని, మీకు ఏదైనా అవసరం వస్తే ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటామని చెప్పారు.
విశాఖపట్నం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని చెప్పారు. పోర్ ఉందని, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయని, బలమైన ఆర్థిక నగరంగా నిలిచిందని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పటిష్ఠ నాయకత్వంలో నిర్వహించనున్న జీ 20 సదస్సుకు సంబంధించి వర్కింగ్ సమావేశాలకు విశాఖ అతిథ్యం ఇస్తుందని చెప్పారు.