HYD: భూమి లోపల పైపులైన్ రిపేరు జరగదు కానీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మాత్రం నిధులు చేరిపోతున్నాయి. పాత లీకేజీల ఫొటోలనే కొత్తవిగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో పని చేయకుండానే బిల్లులు డ్రా చేసే ‘ట్రిక్కు’ జలమండలిలో వైరల్ అయ్యింది. సెక్షన్ ఆఫీసర్ల అండదండలతోనే ఈ బోగస్ బిల్లుల దందా సాగుతోంది. థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ పేరుకే తప్ప అంతా కాంట్రాక్టర్లదే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి.