నల్గొండ: కొండమల్లేపల్లి గ్రామపంచాయతీలో ఇవాళ ఉదయం 10 గంటలకు పశువుల సంత బహిరంగ వేలం పాట జరగనుంది. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక్కో డీడీ పది లక్షల రూపాయల చొప్పున 25 డీడీలు వచ్చాయి. నల్గొండ జిల్లాలోనే కొండమల్లేపల్లి సంత పెద్దది కావడంతో వేలంపాటలో సుమారు కోటిన్నర నుండి రెండు కోట్ల వరకు పలకొచ్చని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సంతను ఎవరు దక్కించుకుంటారో చూడాలి మరి.