BDK: సింగరేణి, ఇసుక రవాణా కారణంగా మణుగూరు – బయ్యారం రహదారిపై ధూళి (Dust) పెరిగి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నేడు ధ్వజమెత్తారు. ఇసుక లారీల అడ్డూఅదుపు లేని ప్రయాణాల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.