అన్నమయ్య: అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్స్ ఆదివారం హార్సిలీ హిల్స్ నందు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్ ఎన్.నవీన్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ట్రెక్కింగ్ వల్ల విద్యార్థుల్లో ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి అలవడుతాయని తెలిపారు. 35వ ఎన్‌సీసీ బెటాలియన్ చిత్తూరు వారు పాల్గొన్నారు.
SKLM: తండేల్ కథ నిజంగా శ్రీకాకుళం జిల్లాలోని జరిగిందని హీరో నాగచైతన్య మూవీ ప్రమోషన్‌లో ఆదివారం వెల్లడించారు. శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించానని హీరో నాగ చైతన్య అన్నారు. అలాగే ఆ సంఘటన గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించిందని చెప్పుకొచ్చారు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ తండేల్ కథలో నిజాయితీ ఉంది అని పేర్కొన్నారు.
SKLM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మార్చి 8 తేదీ వరకు ఆయా సోమవారాలలో నిర్వహించే గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – గ్రీవెన్స్) రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. తదుపరి గ్రీవెన్స్ నిర్వహణ తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
అన్నమయ్య: నిన్న సీఎం చంద్రబాబు సభలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాధవ్ ప్రజా సమస్యలపై నినాదాలు చేస్తే అరెస్టు చేయడాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు ఖండిస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ మదనపల్లె మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయకూడదని అలాగే బీటీ కళాశాలను యూనివర్సిటీ చేయాలంటూ నినాదాలు చేశారన్నారు. మాధవ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రకాశం: సంతమాగులూరు పోలీస్ స్టేషన్ నందు మహిళల సౌకర్యం కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సంతమాగులూరు ఎస్సై పట్టాభి రామయ్య చెప్పారు. వివిధ సమస్యల మీద పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళలకు ప్రత్యేక డేస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సమస్యల మీద స్టేషన్‌కు వచ్చే మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: నందికొట్కూరు పట్టణంలోని నీలి సికారి పేటలో టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాటు సారా బట్టిలపై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారు చేస్తున్న బట్టిలను ధ్వంసం చేశారు. బిందెలలో ఉన్న బెల్లపు ఊట కూడా నాశనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అన్నమయ్య: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలను దుబారా చేస్తున్నారని ఈ రోజు రాయచోట్ల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెల సాధారణంగా జరిగే పెన్షన్ కార్యక్రమానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ చంద్రబాబు ప్రభుత్వ ధనాన్ని దుబారా ఖర్చు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
W.G: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీకి పూల మొక్క అందజేశారు. అనంతరం ఎస్పీ నయిం జిల్లాలోని లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీకి వివరించారు.
ELR: గణపవరం గ్రామ దేవత దండు మారెమ్మ అమ్మవారిని ఆదివారం ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దర్శించుకుని పూజలు చేశారు. జరగబోయే జాతర మహోత్సవాలకు జనసేన నాయకులు లక్ష రూపాయలు విరాళాన్ని ఎమ్మెల్యే ధర్మరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో నూతన ఆర్టీసీ బస్టాండుకు మోక్షం కలిగేలా లేదు. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర మంత్రి దివంగత పరిటాల రవీంద్ర ఈ బస్టాండుని ప్రారంభించారు. అయితే అప్పటి నుండి ప్రభుత్వాలు మారాయి కాని నేటికి ఈ బస్టాండు వాడుకలోకి రాలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 23న ఆర్టీసీ అధికారులు ఈ బస్టాండుకి రంగులు వేసి వదిలేశారు.
ATP: ఉరవకొండ టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయనకు అర్జీలను సమర్పించారు. మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.
W.G: ఉమ్మడి ప.గో జిల్లాలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్ డిసెంబర్‌లో మొదలై జనవరి నుంచి విజృంభిస్తోందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఇప్పటికే లక్షకు పైగా కోళ్లు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. 2012, 2020 లోనూ ఈ వైరస్ వచ్చిందని, ప్రభుత్వం విపత్తుగా పరిగణించాలని కోరుతున్నారు.
విశాఖలోని ఆశిల్ మెట్ట వద్ద గల యూనియన్ బ్యాంకులో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకొని మంటలు ఆర్పి వేశారు. బ్యాంకులో ఏసీ ఆఫ్ చేయకపోవడం వల్లే మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తేల్చారు. బ్యాంకులో ఏసీ, ఫర్నిచర్ మంటల్లో కాలిపోయాయి.
ATP: ఆంధ్రప్రదేశ్ శాప్ కమిటీ చైర్మన్ అనిమిని రవి నాయుడును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కలిశారు. నగరంలోని ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్‌లో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని రవి నాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు. జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని తెలిపారు.
KRNL: ఆదోని పట్టణంలోని స్థానిక పౌర సరఫరాల గోదామును శనివారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. రేషన్ నిల్వలు, భద్రత తదితర అంశాలను సమీక్షించిన ఆయన, లబ్ధిదారులకు బియ్యం పంపిణీలో పొరపాట్లు చోటు చేసుకోకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తనిఖీలో పౌర సరఫరాల డీటీ వలిభాష, రవీంద్ర, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.