KRNL: ఇసుక ఉచితంగా పొందాల్సిన వారు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని గోనెగండ్ల సీఐ గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహన తనిఖీ నిర్వహించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. బహిరంగంగా మద్యం సేవించటం చట్టరీత్యా నేరమన్నారు.
E.G: రాజమహేంద్రవరం స్థానిక నాగరాజా ప్రాథమిక పాఠశాల HM మోటూరి మంగారాణి, మేడిది సుబ్బయ్య ట్రస్ట్ స్వచ్చంద సేవా సంస్థ వారిచే ‘విశిష్ట సేవా రత్న” పురస్కారం అందుకున్నారు. ట్రస్ట్ అధినేత మేడిది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తమ ట్రస్ట్ ద్వారా నేడు విద్య, సాంస్కృతిక, కళారంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి పురస్కారం అందిస్తున్నామన్నారు.
కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం రూ.25వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్.సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా 3వ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సమస్యలకు సంబంధించి విషయాలను ఆయన మీడియాకు వివరించారు.
KDP: వేముల పంచాయతీ పరిధిలోని శేషన్నగారిపల్లెలో ఆదివారం శ్రీ సీతారామ, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా పురోహితులు ఆలయంలో శ్రీ సీతారామ, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించి హోమాలు పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివార్లను భక్తులు, వైసీపీ శ్రేణులు దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించారు.
KDP: జానపద సాహిత్య పరిశోధనా శిఖరం ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు అని వివిధ సంఘాల పార్టీ నేతలు కొనియాడారు. రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన తంగిరాల సుబ్బారావు సంస్మరణ సభ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తొలిత చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.
TPT: గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు అర్చనలు అలంకారాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో గూడూరు గ్రామ శివారులో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ATP: హీరో నందమూరి బాలకృష్ణను అనంతపురానికి చెందిన ఆయన వీరాభిమాని జగన్ కలిశారు. బాలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. తమ అభిమాన హీరోకు దేశంలోని అత్యున్నత పురస్కారం రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. బాలయ్యకు వైద్య సేవల్లోనూ అవార్డు వరించాలని ఆకాంక్షించారు.
VZM: విజయనగరం స్థానిక బాబామెట్టలో గల శ్రీ శివ పంచాయతన దేవాలయంలో ఆదివారం మాఘ మాసం మొదటి వారం పర్వదిన సందర్భంగా అర్చకులు సుప్రభాత సేవ అనంతరం శ్రీ సూర్యనారాయణమూర్తికి అభిషేకాలు, అర్చనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కేఏపీ రాజు, శివ, నారాయణ రావు, సాంబరాజ పాల్గొన్నారు.
KDP: సింహాద్రిపురం మండలం బిదినం చెర్ల గ్రామంలో పార్వతమ్మ(80)అనే వృద్ధురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందినది. మృతురాలి ఇంటికి గత 4రోజులుగా తాళం వేసి ఉండగా ఇంటిలో నుంచి దుర్వాసన వస్తుంటే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AKP: కేంద్రం ప్రకటించిన 2025-26 బడ్జెట్ కేటాయింపులపై అనకాపల్లి ఎంపీ డాక్టర్ CM.రమేష్ స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్, నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్ అని ప్రత్యేకంగా కొనియాడారు. రూ.12 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్నుమినహాయింపు ప్రకటించడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించిందని పేర్కొన్నారు.
VZM: డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరగకుండా ఎస్సై ఏ.సన్యాసి నాయుడు ప్రత్యేక చొరవతో ముఖ్యమైన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారి కావడంతో ముందుస్తు చర్యలలో భాగంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ముందుగా గుర్తించి బంగారు వర్తకులతో మాట్లాడి ఫ్లెక్సీలను తయారు చేసి ప్రధాన కూడళ్ళలో ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
AKP: జిల్లాలోని చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో మూర్తి ఆదివారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సెలవు రోజుల్లో నిర్వహించే తరగతుల్లో మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. అలాగే పండగ సెలవులే కాకుండా రెండవ శని ఆదివారాల్లోనూ విద్యార్థులకు తరగతులు జరుగుతాయన్నారు.
TPT: వడమాలపేట మండలం సీతారాంపేట పంచాయతీ ప్రజలు ఆదివారం ఉదయం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌కు రూ.50 వేల చెక్కును అందజేశారు. అమరావతి నిర్మాణానికి రూ.50 వేల చెక్కు అందజేసినట్లు టీడీపీ మండల అధికార ప్రతినిధి ధనంజేయులు నాయుడు తెలిపారు. ఈ కార్య క్రమంలో గ్రామకంఠం అద్యక్షులు దేవరాజులు నాయుడు, హరిప్రసాద్ పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లెలోని జడ్పీ హై స్కూల్లో గణిత శాస్త్ర ఉపాధ్యాయులైన ఒంటి కొండ చలపతి నాయుడుకి అరుదైన గౌరవం దక్కింది. గణిత శాస్త్రంలో విద్యార్థులకు సులువైన పద్ధతిలో అత్యుత్తమ బోధన చేస్తున్నందుకు తెలుగు వెలుగు వారు పురస్కారానికి ఎంపిక చేశారు. ఆదివారం విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రం నందు ఆయనకు కాళోజి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారాన్ని అందజేశారు.
SKLM: రథసప్తమి వేడుకల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ఆదివారం డచ్ భవనం వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఉచిత హెలీ టూరిజం విహారానికి అవకాశం కల్పించారు. విద్యార్థులను దగ్గరుండి హెలికాప్టర్ ఎక్కించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.