KKD: పెద్దాపురం గ్రామ దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ మరిడమ్మ అమ్మవారికి అలంకరణ నిమిత్తం పెద్దాపురం వాస్తవ్యులు పడాల దుర్గారావు, లింగం సాయి చరణ్ కలసి 16గ్రాముల 30 మిల్లి గ్రాముల బంగారు నక్లెస్‌ను మరిడమ్మ అమ్మవారి దేవస్థానానికి ఆదివారం బహుకరించారు. ముందుగా దాతలు అమ్మ వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ సిబ్బంది అభినందించారు.
చిత్తూరు: కలెక్టరేట్‌లో రేపు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 1వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని అన్నారు.
KDP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటన ఎంపీడీవోను పరామర్శించడానికి కాదని, రాజకీయ కోణంలో జరిగిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. రాయలసీమ వాసుల్ని అవమానించే రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడడంపై రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, కించపరిచే విధంగావారి ఆత్మ అభిమానం దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
NDL: సంజామల (మ) మంగపల్లెలో శ్రీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డా.పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన 51వ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డైరెక్టర్లు షేక్షావల్ రెడ్డి, మౌలాలి రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యంతో పాటు భోజన వసతి కల్పించామన్నారు.
NLR: నగర వ్యాప్తంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరా పరిశుద్ధంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. సంగం మండలం మహమ్మదాపురంలోని మంచినీటి శుద్ధి కేంద్రాన్ని అధికారులతో కలిసి కమిషనర్ ఆదివారం పరిశీలించారు. క్లోరినైజేషన్ క్రమం తప్పకుండా చేయాలని ఆదేశించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి అర్బన్ ఎస్సై నాగవీరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం తాడిపత్రి పట్టణంలోని శివాలయం సమీపంలో గల స్మశాన వాటికలో నాగ వీరయ్య మృతదేహానికి పోలీస్ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నాగ వీరయ్య ఎస్సైగా పదోన్నతి పొందిన తర్వాత తాడపత్రి, యాడికి మండలాలలో పనిచేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు.
E.G: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలలో అల్లర్లు సృష్టించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డీ.నరసింహ కిషోర్ హెచ్చరించారు. డిసెంబరు 31 రాత్రి నిర్దేశించిన సమయం మేరకు మాత్రమే హోటళ్లు, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లకు అనుమతి ఉందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఘటనలకు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు.
ప్రకాశం: ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చెప్పారు. ఒంగోలులో ఆదివారం జరిగిన ఆర్యవైశ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఆర్యవైశ్యుల వ్యాపారాలకు ఇలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు.
CTR: ప్రజల క్షేమమే తన కాంక్షగా ముందుకు సాగే నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మనమందరం తోడుగా ఉండాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పుంగనూరు రూరల్ మాగండ్లపల్లి గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు పార్టీలో చేరారు. తర్వాత గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేశారు.
కృష్ణా: నూజివీడు పట్టణంలోని సబ్ జైలును ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అరుణ సారిక, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ సర్వీస్ సెక్రటరీ కేవీ కృష్ణయ్యల బృందం ఆదివారం సందర్శించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు సబ్ జైలును పరిశీలించారు. సబ్ జైల్లో వసతి సౌకర్యాలు, ముద్దాయిల ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
KRNL: శ్రీశైలం క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి1 తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడనున్నాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దామెర్లకుంట పెద్దచెరువు ప్రాంతాలలో చేయాల్సిన ఆయా ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు.
CTR: న్యూఇయర్ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆంక్షలు విధించారు. డిసెంబరు31 రాత్రి జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్ట్‌లు, పికెట్‌లను ఏర్పాటు చేసి రాత్రి నుంచి వాహనాల తనిఖీ చేస్తామన్నారు. వారధి,యూనివర్సిటీ ఫ్లైఓవర్లను రాత్రి 10గంటలకు మూసివేయడం జరుగుతుందన్నారు. అశ్లీల నృత్యాలు, DJ వంటివి అనుమతులు లేవన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
SKLM: సంతబొమ్మాలి మండలం జగన్నాధపురంలో సర్పంచ్ రాములమ్మ ఆధీనంలో ఉన్న భూమిలో కొబ్బరి మొక్కలను తహసీల్దార్ రమేష్ కుమార్ పోలీస్ సిబ్బందితో వెళ్లి ఆదివారం జెసిబితో తొలగించారు. తాను వైసీపీలో ఉండడం వల్లే రాజకీయ కక్షతో కొబ్బరి మొక్కలు తొలగించారని రాములమ్మ ఆరోపించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడంతో భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నంను క్రీడా హబ్గా మార్చేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌లో సుబ్బారావు స్మారకంగా ఏర్పాటు చేసిన వెటరన్ క్రికెట్ టోర్నీ బహుమతి ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. అనంతరం క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చి వారందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
W.G: మాదిగలను మాదిగ ఉప కులాలను మాలలుగా చిత్రీకరించి గత ప్రభుత్వ కుల గణన సర్వే ఆధారంగా కాకుండా 2011 సంవత్సరంలోని కులగణన సర్వే ప్రకారం వర్గీకరణ జరగాలని ఉత్తర కోస్తా జిల్లాల ఎమ్మార్పీఎస్ సమన్వయకర్త ముమ్మిడివరపు సుబ్బారావు అన్నారు. ఆదివారం కొవ్వూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. కులగణన సర్వే గడువు తేదీ పెంచాలని డిమాండ్ చేశారు.