• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ 1న పుష్పగిరి క్షేత్రాన గిరి ప్రదక్షణ

KDP: ఏప్రిల్ 1న పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ ఉంటుందని శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ సమితివ్య వస్థాపక అధ్యక్షుడు సట్టి భారవి తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులు ఉదయాన్నే గిరి ప్రదక్షణ చేయాలన్నారు. విచ్చేసే భక్తులకు దాతల సహకారంతో తాగునీరు, మజ్జిగ, అల్పాహారం ఏర్పాటు చేయనుట్లు చెప్పారు.

March 30, 2026 / 10:25 AM IST

నేడు నరసాపురం మున్సిపాలిటీలో బహిరంగ వేలం

W.G: నరసాపురం పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల ఫీజుల వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆర్.రామిరెడ్డి తెలిపారు. ఈ వేలం ప్రక్రియ 30న సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమవుతుందన్నారు. సదరు పాటదారులు అందరూ బహిరంగ వేలంలో పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.

March 30, 2026 / 10:22 AM IST

నేడు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం

SKLM: జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామంలో ఇవాళ సాయంత్రం ‘నమస్తే ఎచ్చెర్ల’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెదేపా మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు హాజరై ప్రజా సమస్యలకు సంబంధించి వినతులు స్వీకరించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

March 30, 2026 / 10:20 AM IST

ర్యాలి జగన్మోహిని ఆలయాన్ని దర్శించిన దేవాదాయ కమిషనర్

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారిని ఆదివారం సాయంత్రం  దేవాదాయ శాఖ కమిషనర్ వి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న వార్షిక కళ్యాణోత్సవాలను తిలకించారు

March 30, 2026 / 10:17 AM IST

నేడు మంత్రి దుర్గేష్ పర్యటన

E.G: మంత్రి కందుల దుర్గేష్ సోమవారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు పెరవలి మండలం నడుపల్లికోటలో ఎంపీపీ పాఠశాల భవన నిర్మాణ శంకుస్థాపన చేస్తారు. 10 గంటలకు పెరవలి మండలం మల్లేశ్వరంలో పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. 11 గంటలకు నిడదవోలు మండలానికి మంజూరైన ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు

March 30, 2026 / 10:13 AM IST

‘వీబీ జీ రామ్‌జీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

AKP: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకు వస్తున్న ‘వీబీ జీ రామ్ జీ’ పథకాన్ని వేతనదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు సూచించారు. అనకాపల్లి మండలం గొలగాంలో ఆదివారం వేతనదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. కూలీలకు కొత్త పథకం ద్వారా 125 రోజులు పని దినాలు కల్పించడం జరుగుతుందన్నారు.

March 30, 2026 / 10:10 AM IST

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి: CITU

PPM: జిల్లాలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని CITU నాయకులు గొర్లి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్దానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమయంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన కార్మికుని కుటుంబాలకు, రిటైర్‌ ఐన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.

March 30, 2026 / 10:08 AM IST

కబడ్డీ పోటీల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

NLR: నగరంలో త్వరలో జరగనున్న 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ వాల్ పోస్టర్‌ను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మే 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించే పోటీలు విజయవంతం చేయాలన్నారు. పలు గ్రామాల నుంచి క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో తలపడనున్నారు.

March 30, 2026 / 10:03 AM IST

నేటి నుంచే పైడిమాంబ జాతర ప్రారంభం

VZM: వీరభద్రపురం, నరపాం సహా ఏడు గ్రామాల ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే వెదుళ్ల పైడిమాంబ అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అమ్మవారి తోలేళ్లు, మంగళవారం అనుపోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 30, 2026 / 10:00 AM IST

ఇరువర్గాలు ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ప్రకాశం: మార్కాపురం మండలంలోని గొట్టిపడియలో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మార్కాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో శ్రీరామ నవమి పండుగ వేడుకలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

March 30, 2026 / 10:00 AM IST

రిజర్వాయర్‌లో మృతదేహం కలకలం

PLD: రెంటచింతల మండల పరిధిలోని మంచికళ్లు బుగ్గ వాగు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమవటంతో కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించారు. మృతుని వయస్సు 35 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తలభాగం నీటిలోకి బోర్లా పడి ఉండటంతో చేపలు మృతదేహాన్ని పీకుతున్నాయి. ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

March 30, 2026 / 09:50 AM IST

సూళ్లూరుపేటపై చంద్రన్న కరుణించేనా..?

TPT: సీఎం చంద్రబాబు ఇవాళ సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాలంగి గ్రాయిన్ దెబ్బతిని ఉప్పు నీరు నదిలో కలసిపోతున్నాయి. నెర్రికాలువ, పాలచ్చూరు కాలువ ఏడాది కాలంగా పనులు సాగక పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై దృష్టి పెట్టి చంద్రన్న కరుణించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

March 30, 2026 / 09:49 AM IST

ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముని దర్శించిన ఎంపీ

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని దర్శించుకుని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆర్కే రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే దాసరి సుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.

March 30, 2026 / 09:44 AM IST

బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు మృతి..!

KRNL: ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామానికి చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు కురువ మాలింగప్ప బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆదివారం కర్నూలులో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన ఎమ్మెల్యే పార్థసారథి సహా పార్టీ నేతలు సంతాపం తెలిపారు. సోమవారం స్వగృహంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

March 30, 2026 / 09:42 AM IST

‘వాహన నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలి’

VZM: వాహన నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని SI రమేశ్ కోరారు. బొబ్బిలి పట్టణంలోని పాత డంపింగ్ యార్డు వద్ద ఆదివారం వాహనాలను తనిఖీ చేసి పాత చలానాలను కట్టించారు. వాహన నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని వాహనదారులను కోరారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్ బాలురలకు వాహనాలు ఇవ్వవద్దన్నారు.

March 30, 2026 / 09:37 AM IST