GNTR: పేద పిల్లలకు ఉచిత విద్య అందించే ఆర్టీఈ ప్రవేశాల్లో ఈసారి గణనీయ వృద్ధి కనిపించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి 2,487 మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో గుంటూరులోనే 1,708 మందికి అవకాశం దక్కిందని తెలిపారు. లాటరీ విధానంలో ఎంపిక చేసి, ఫీజులను ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు.
PPM: బలిజిపెట మండలం బర్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఎర్ల రాంబాబు శాస్త్రి సీతారాముల కళ్యాణం ఏర్పాటు చేశారు. గ్రామంలో చిన్నలు, పెద్దలు అందరూ పాల్గొని జైశ్రీరామ్ జైశ్రీరామ్ నినాదాలు గ్రామంలో మారుమోగాయి. కళ్యాణం అనంతరం గ్రామంలో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పెద్దలు తెలిపారు.
అన్నమయ్య: జిల్లాలో వృత్తి విద్యపై జిల్లా స్థాయి ఓరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డైట్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 39 పీఎం శ్రీ పాఠశాలలు, 35 జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వొకేషనల్ ఇన్‌స్పెక్టర్‌లు కలిపి సుమారు 200 మంది పాల్గొన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అసదుల్లా జాతీయ విద్యా విధానం 2020 ప్రాముఖ్యతను వివరించారు.
కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు హోటల్ యజమానులు ఆరోపిస్తున్నారు. పుల్లల పొయ్యిలపై ఇడ్లీలు తయారు చేస్తున్నామని ఆకివీడు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికే కొందరు వ్యాపారాలు మూసివేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.
కడప: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మొదలవుతుందని అన్నారు. ఈ మేరకు జిల్లాలోని కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు విధిగా హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.
ATP: విద్యా హక్కు చట్టం మేరకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు జిల్లాలో 1712 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చే నెల 4 తేదీలోగా ఆయా పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలు నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం మొదటి విడత మాత్రమే చేశామన్నారు.
SS: సోమందేపల్లి మండలం పరిసర గ్రామాల్లో పెంపుడు జంతువులను రోడ్లపై వదిలివేయడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యజమానులు కోళ్లు, కుక్కలు, ఆవులు, జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయడం చట్టరీత్యా నేరమన్నారు. యజమానులు తమ జంతువులను తమ స్వంత ప్రదేశాల్లోనే కట్టడి చేయాలని కోరారు.
PPM: గుమ్మలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు చెందిన ప్రణీత ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్-2026 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల ఝార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి 200 మీటర్ల పరుగు పోటీలలో టాప్-8లో నిలిచినట్లు కోచ్ శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు చత్తీస్‌గఢ్‌లో జరిగే పోటీలలో ఆమె పాల్గొననుంది.
NDL: బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలో 2025-26కు సంబంధించి ఇంటి పన్నులు, ఫ్యాక్టరీ, కుళాయి, కాళీ స్థలాల పన్నులు, ట్రేడ్ లైసెన్స్ చెల్లించుటకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున వడ్డీపై 50% రాయితీ ఇస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ గురువారం తెలిపారు. ఈ అవకాశం ఈనెల 31వ తేదీ వరకు ఉందన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
E.G: అనపర్తి నియోజకవర్గంలో రక్షిత మంచినీటి సౌకర్యం కోసం రూ.42 కోట్ల నిధులు మంజూరైనట్లు MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ తెలిపారు. ప్రతి గ్రామానికి సురక్షిత జలాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఈ నిధులతో మంచినీటి సమస్యకు ఇబ్బంది ఉండదన్నారు.
KRNL: ఆస్తి వివాదంలో తండ్రిపై కత్తితో దాడి చేసి నగదు, బంగారం దోచుకున్న కేసులో వేణుగోపాల్ (35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 18న కపటి గ్రామంలో తండ్రి శంకరప్ప గౌడ్‌పై దాడి చేసి, తల్లిని గాయపరిచి, రూ.2 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకుని బైక్‌తో పరారైనట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. చాగి బస్టాండ్ వద్ద పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను ఆశీనులు చేసి పూజలు చేస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి, బలిపీఠానికి పూజలు చేసి, గరుడ పథకాన్ని ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
TPT: గూడూరు పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇవాళ ఉదయం వినియోగదారులు బారులు దీరారు. స్టాక్ పరిమితంగా ఉండటంతో తెల్లవారుజాము నుంచే జనం క్యూ కట్టారు. సిలిండర్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.
తిరుపతి జిల్లాలో పోలీస్ డాగ్ చనిపోయింది. 2016లో హైదరాబాద్ మోయినాబాద్‌లోని IITAలో ‘హంటర్’ డాగ్ ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత తిరుపతికి తీసుకు వచ్చారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో విశేషంగా కృషి చేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈక్రమంలో నిన్న చనిపోయింది. ఎస్పీ డి. శ్రీనివాసరావు, సిబ్బంది హంటరు నివాళులర్పించారు.
PPM: ఆర్టీసీ బస్ స్టేషన్‌లో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా, అన్ని రకాల మౌలిక వసతులతో ఉండాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో ఉన్న బస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా బస్ స్టేషన్‌లోని ఫ్లాట్ పారంలు, తాగునీటి వసతి, విక్రయ దుకాణాలు, మరుగుదొడ్లు పారిశుధ్య పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.