ATP: జిల్లాలో గంజాయి వినియోగదారులను గుర్తించేందుకు సమన్వయంతో పని చేయాలని అదనపు ఎస్పీ డి.వి. రమణమూర్తి సూచించారు. ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో వివిధ శాఖలతో సమావేశమయ్యారు. డోర్ టు డోర్ సర్వే చేయాలని నిర్ణయించారు. 1972 టోల్ ఫ్రీ నంబర్‌ను విడుదల చేశారు. విద్యాశాఖ, జైలు, డ్రగ్స్, ఎక్సైజ్, NGOలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో గురువారం సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల తెగల వారి ఫిర్యాదులను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
కృష్ణా: సుంకర సాయి కుమార్తె సుంకర గవీర్ని మోక్షిత గిన్నిస్ రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే. కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఆమె ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బాలిక కుటుంబ సభ్యులను కలిసి అభినందనలు తెలిపారు. ఆమె ప్రతిభను కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
SKLM: శ్రీకాకుళం మండల కేంద్రం సారవకోట శ్రీ ఉమా త్రైలోకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం తాబేళ్లు సందడి చూసి పలువురు విద్యార్థిని విద్యార్థులు ఆనంద వ్యక్తపరిచారు. ఎంతో చరిత్ర కలిగిన శివాలయంలో కొన్ని దశాబ్దాల కాలం నుండి తాబేలు నివసిస్తూ ఉన్నాయి. వీటికి భక్తులు ఆహారం కోసం ఆకుకూరలు అందిస్తుంటారు.
NTR: ప్రభుత్వ ఫలాలు ఏది పొందాలన్నా రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి అని, ఈ-కేవైసీ ప్రక్రియకు ఈనెల 30వ తేదీ ఆఖరి రోజని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం అన్నారు. నందిగామలోని కాకానినగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి చేయించాలని సూచించారు.
ELR: పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు కేంద్ర నిపుణుల బృందం రెండో రోజు గురువారం కొనసాగింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బీ.సిద్దార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు మట్టి నమూనాలు సేకరించారు. వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామన్నారు.
కృష్ణా: మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడులో పర్యటించనున్నారు. అనంతరం పెనమలూరు మండలం వణుకూరులోని దాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సంబంధిత అధికారులు పాల్గొంటారు.
NLR: విడవలూరు మండలం దంపూరులో గడ్డివామి కాలిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు పసల శంకరయ్యకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచన మేరకు టీడీపీ యువనేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. సహాయాన్ని ఎమ్మెల్యే నివాసంలో అడపాల శ్రీధర్ రెడ్డి, విజయ రాఘవన్ సమక్షంలో అందించారు.
NLR: వెంకటాచలం హౌసింగ్ ఏఈగా పనిచేస్తున్న శివమోహన్ సస్పెండ్ అయ్యారు. గతంలో ఆయన పొదలకూరు హౌసింగ్ ఏఈగా పనిచేశారు. ఆ సమయంలో పాత పక్కా ఇళ్లకు బిల్లులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల మంత్రి పార్థసారథి పొదలకూరు పర్యటనకు వచ్చినప్పుడు ఏఈ అవినీతి, అక్రమాల విషయం తెలిసింది.
నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు సీఈవో విద్యా రమ ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. ప్రధానంగా 2025 సంవత్సరానికి సంబంధించి జిల్లా, మండల పరిషత్ సవరణ బడ్జెట్, అంచనా బడ్జెట్‌పై సమీక్షిస్తామన్నారు.
NLR: అకారణంగా ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రాత్రి నెల్లూరు అయ్యప్పగుడి సెంటరులో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న బక్షు ఓ దుకాణంలో ఉండగా, అదే దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. దుకాణదారుడితో బక్షు మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తన దగ్గర ఉన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఛాతీ మీద పొడవడంతో బక్షు సొమ్ముసిల్లిపడిపోయాడు.
NLR: ఆత్మకూరు పట్టణ చెరువులో మట్టిమాఫియా ఎక్కువవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలు, టిప్పర్ల సాయంతో రాత్రి వేళల్లో మట్టి తరలిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వాహనాల శబ్దాలతో రాత్రుల్లో తమకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
NLR: కోవూరు మండలంలోని జాతీయ రహదారిపై సంభవించిన గాలివాన ప్రాణం తీసింది. ముంబయి నుండి ఫెడోరా రొయ్యల కంపెనీకి మేత తీసుకొచ్చిన లారీ క్లీనర్ కరణ్ మోహన్ గైక్వాడ్ (28) గాలులకు మేతపై పట్ట కప్పేందుకు లారీపైకి ఎక్కాడు. ఈ క్రమంలో అదుపు తప్పి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
W.G: కొల్లేరు వాసులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కొల్లేరు ప్రాంత జిరాయితీ భూముల యజమానులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కొల్లేరు వివాదానికి కారణమవుతున్న అంశాలపై 12వారాల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార సంస్థకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం దొరుకుతుందన్నారు.
కడప: పట్టణంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్లో గత అర్ధరాత్రి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గంజాయి కేసులో నాకాష్ వీధికి చెందిన ఉన్న సోనూ అలియాస్ పాండు అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి బాత్ రూమ్‌కు వెళ్లి షర్ట్‌తో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.