SKLM: కోరం లేక పాలకొండ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. కాగా.. కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఈ ఎన్నిక పూర్తిగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికపై ఎలక్షన్ కమీషన్‌కు నివేదిక పంపిస్తున్నట్లు పాలకొండ మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు వెల్లడించారు.
SKLM: ఫిబ్రవరి 6న విజయ గౌరీ నామినేషన్‌కి తరలి రావాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గిరిధర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని స్థానిక యుటిఎఫ్ భవన్లో అధ్యాపక, ఉపాధ్యాయులతో సంఘాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ పరిరక్షణకు, ఉపాధ్యాయ సంక్షేమానికి ఉద్యమ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ గెలుపు అవసరమని పేర్కొన్నారు.
E.G: కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం నందు కొలువు దీరిన శ్రీ సద్గురు సుందర సాయిబాబా మందిరం 30వ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని సాయిబాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దిపట్ల శివరామ కృష్ణ, కంఠమణి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
SKLM: నందిగం మండలం బడబంధ, కోటిపల్లి, కోటియా కొండపేట, బంజీరుపేట గ్రామాల రహదారి సమస్యలపై మంగళవారం నందిగం జనసేన పార్టీ అధ్యక్షుడు తాడేల చిరంజీవి, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్లో మంత్రిని కలిసిన ఆయన… రహదారి సమస్యలను వివరించి పరిష్కరించాలని మంత్రిని కోరారు.
కృష్ణా: పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని సీఎం అధికారిక నివాసంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలిసిన బోడె ప్రసాద్ తన కుమారుడు వెంకట్ వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు.
E.G: దేశంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టడం దారుణమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ల కోసమే ప్రవేశపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
GNTR: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. నేరాలు, చోరీల నియంత్రణకు మండలంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వెంకటరవితో కలిసి ఎస్పీ పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ASR: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా డుంబ్రిగూడ వైద్య సిబ్బంది PHC నుంచి మూడు రోడ్డుల జంక్షన్ వరకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ పై అవగాహన పెంచుకుందాం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహిద్దాం అంటూ నినాదాలు చేశారు. క్యాన్సర్ లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నివారణ గురించి ప్రజలకు సమాచారం అందించారు.
SKLM: రథసప్తమి సందర్భంగా భక్తులకు రెడ్ క్రాస్ వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలోనే మంగళవారం ఓ వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయింది. అయితే, అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సరోజిని తక్షణమే స్పందించారు. ఆమెకు సపర్యలు చేసి ఆలయ ప్రాంగణంలోని వైద్య శిబిరంలో చికిత్స చేయించారు.
కృష్ణా: జాతీయ రహదారిపై భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. మంగళవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ టోల్ గేట్ సమీపంలో విజిలెన్స్ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న రెండు లారీలను గుర్తించి అడ్డుకున్నారు. ఒక లారీలో 250 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరొక లారీలో సీఎంఆర్ బియ్యం ఉన్నాయని వాహనదారుడు రికార్డ్ చూపగా, వాటిని తనిఖీకు పంపించారు.
AKP: గొలుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ శ్యాం కూమార్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శ్యాం కూమార్ క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవలసి జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
KKD: మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కాకినాడ సీనియర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవన్లో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మురళీకృష్ణ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఆటో డ్రైవర్లు ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు.
ATP: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా గుత్తి గేట్స్ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం కళాశాల విద్యార్థులు క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యం, అలవాట్లు, ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోండి – క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టండి అని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం గాంధీ చౌక్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.
SKLM: పాఠశాలలను విలీనం చేయొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ మేరకు పాలకొండ ఎంఈఓ కార్యాలయం వద్ద గొట్టమంగళాపురం గ్రామానికి చెందిన విద్యార్థుల, తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల విలీనం చేయడం ద్వారా విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
NTR: నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక 11గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ హల్కు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేరుకున్నారు. టీడీపీ నాయకులు కౌన్సిల్ సమావేశానికి భారీగా చేరుకోవటంతో ఎటువంటి గొడవలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశానికి శాఖమూరి స్వర్ణలత, కామసాని సత్యవతి చేరుకోవాల్సి ఉంది.