GNTR: ఈనెల 30న వన్ మాన్ కమిషన్ పర్యటన శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్ (రిటైర్డ్) నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణపై నిర్దిష్ఠ సిఫారసులు సూచించడానికి జిల్లాలో పర్యటించనుంది. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేశారు.
కడప: ఇటీవల ఖాజీపేట మండల కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన కోనేటి హరి ఆదివారం రాత్రి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను కలిశారు. కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి కారకులైన ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌ను సన్మానించడం జరిగిందని కోనేటి హరి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి సోమవారం ఉదయం స్వగృహంలో ప్రజావినతులు స్వీకరిస్తారు. అనంతరం మద్యాహ్నం 1:30 గం.లకు మక్కువ మండలం శంబర గ్రామంలో శ్రీ శ్రీ పోలమాంబ జాతరను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మంత్రి కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో కోరాయి.
NLR: బుచ్చి మండలం దామరమడుగు గ్రామంలో ఆదివారం బీసీ సేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నిమ్మల నాగార్జున యాదవ్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేమిరెడ్డి దంపతుల మీద అభిమానంతో గ్రామంలో నిరుపేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిర్మల వెంకటేశ్వర్లు, వంశీ, లక్ష్మణరావు, సునీల్, అనూష తదితరులు పాల్గొన్నారు.
GNTR: సోషల్ మీడియాను మంచికి వాడుదాం అంటూ తాడేపల్లిలో భారీ హోర్డింగ్ వెలసింది. చెడు వినొద్దు, చెడు కనొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్ సోషల్ మీడియాపై క్యాంపెయిన్ త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగుల ఏర్పాటు చేశారు. పోస్ట్ నో ఈవిల్ పేరుతో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణ బీజేపీ అధ్యక్షులుగా అపిసెట్టి ఉదయ్ శంకర్ రెండోసారీ ఎన్నికయ్యారు. పదవి కోసం ఇద్దరు పోటీపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికను రిటర్నింగ్ అధికారి రెడ్డి మల్లా రెడ్డి పర్యవేక్షించారు. ఎన్నికలో ఉదయ్ శంకర్‌కు మెజార్టీ లభించడంతో మల్లారెడ్డి గెలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు ఉన్నారు.
KRNL: జిల్లాలో సోమవారం 5 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదోని రెవెన్యూ డివిజన్లోని జాలిమంచి, పాండవగల్లు, కర్నూలు రెవెన్యూ డివిజన్లో కర్నూల్ అర్బన్, కల్లూరు మండలంలోని రామదూర్, మొత్తము 05 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అన్నమయ్య: పీటీఎం మండలం కాట్నగల్లు సచివాలయంలో ఈనెల 31న మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రామూర్తి నాయక్ తెలిపారు. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరవుతారన్నారు. గ్రామంలోని ప్రజలు, రైతులు సదస్సుకు హాజరై తమ భూ, రెవెన్యూ, ఇతరత్రా సమస్యలు తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు.
ATP: రాప్తాడు నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ప్రతి తరగతికి అదనపు సీట్లు కేటాయించాలని ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంజేపీ గురుకుల పాఠశాలల సెక్రటరీ కృష్ణ మోహన్ ఆదివారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని పేరూరు, నసనకోట ఎంజేపి బాల బాలికల పాఠశాల పరిశీలించారు.
W.G: మొగల్తూరు మండలానికి చెందిన ముత్యాలపల్లి గ్రామానికి చెందిన శ్రీబండి ముత్యాలమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్ కడలి మాణిక్యాలరావు, తన అనుచరులతో కలిసి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.
కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థులు హాజరవ్వాల్సిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు సోమవారం నుంచి ఫిబ్రవరి 2 వరకు జరగనున్నాయి. మచిలీపట్నంలోని జిల్లా పోలీసు పెరేడ్ మైదానంలో జరిగే ఈవెంట్లకు హాజరవ్వాల్సిన అభ్యర్థులకు ఆదివారం జిల్లా పోలీస్ అధికారులు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు ఈవెంట్లకు వచ్చే అభ్యర్థులు సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలను విడుదల చేశారు.
కోనసీమ: అయినవిల్లి మండలం మాగాంకు చెందిన నక్కా సోమశేఖర్ (32) ఆదివారం బైక్‌పై వెళుతుండగా ముమ్మిడివరం మండలం అనాతవరం వాటర్ ప్లాంట్ వద్ద వెనక నుంచి ట్రక్ ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని అమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
KKD: మాజీ సీం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే విద్యుత్ భారాలు పడ్డాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం MLA రాజప్ప మాట్లాడుతూ..విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే అన్నారు. ఆయనే విద్యుత్ చార్జీలు పెంచి, ఆయనే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడమే కాదా? అని ప్రశ్నించారు.
KDP: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపు కడప జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి కడప కలెక్టరేట్లోని సభా భవనంలో ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. మండల స్థాయిలో పరిష్కారం కానీ ఫిర్యాదులు మాత్రమే ఇక్కడ స్వీకరిస్తామన్నారు.
ప్రకాశం: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం STU బాపట్ల జిల్లా శాఖ 78వ వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లాలోని 25 మండలాల నుంచి మండల శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. AISTF జాతీయ కోశాధికారి జోసఫ్ సుధీర్ మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసిన రూ.25వేల కోట్ల చెల్లించాలన్నారు.