PPM: సీతానగరంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో ఉదయం 8 గంటలైనా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ వారం రోజుల్లో మరింత చలి తీవ్రత ఎక్కువ కావడంతో వృద్ధులు, పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు చలితోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు మరింత చలి తీవ్రత పెరగడంతో తట్టుకోలేని పరిస్థితి నెలకొంది.
PLD: యూటీఎఫ్ వినుకొండ ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పట్టణంలోని జాషువా కళాప్రాంగణంలో జిల్లా కోశాధికారి రవిబాబు అధ్యక్షతన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల మహోత్సవ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ అధ్యక్షులు, కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా 33 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనీలకు పురస్కారం పొందారు.
NLR: నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లను ఆదివారం నెల్లూరు మున్సిపల్ కమీషనర్ సూర్యతేజ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అలాగే ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
VZM: నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అల్లూరి మురళి(రాజు)ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రశంసించారు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా కృషి చేసినందుకు మురళిని అభినందించారు. అలాగే సంకల్పం కార్యక్రమం ద్వారా యువతలో మత్తు పదార్థాల వినియోగం పట్ల చైతన్యం తీసుకురావడంలో చురుకైన పాత్ర పోషించినందుకు ప్రశంసాపత్రం అందజేశారు.
GNTR: వెల్దుర్తి మండల ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ వినియోగం పెరిగిపోయిందన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ATM పిన్ నంబర్, CVV నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు అడిగితే చెప్పరాదని సూచించారు.
కోనసీమ: జిల్లా అభివృద్ధికి క్రీడలు కూడా సహకరిస్తాయని MLA బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆదివారం ఉప్పలగుప్తం మండలం S.యానాంలో జరుగుతున్న జాతీయ స్థాయి మహిళా బీచ్ వాలీబాల్ పోటీలలో MLA అయితాబత్తుల ఆనందరావుతో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తిలకించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రీడలను మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.
EG: జిల్లా సీపీఎం కార్యదర్శి గా టి.అరుణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు రోజులపాటు రాజమండ్రిలో జరిగిన సీపీఎం తూర్పుగోదావరి 24వ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శిగా అరుణ్ ఎన్నిక కాగా, కార్యవర్గ సభ్యులుగా జువ్వల రాంబాబు, తులసి, పవన్ ఎన్నికయ్యారు.
NDL: న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పలు ఆంక్షలు విధించారు. 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున పోలీసుల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. వేడుకలు జరుపుకునే వారు ముందస్తు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. రాత్రి 10 తర్వాత సౌండ్ సిస్టం నిషేధం. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. సైలెన్సర్ సౌండ్స్ చేయరాదు, వాహనాలు వేగంగా నడపరాదు అన్నారు.
VZM: రోజు రోజుకు ప్రాభవాన్ని, వినియోగాన్ని కోల్పోతున్న తెలుగు భాషను బతికించుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలపై ఉందని రోటరీ జిల్లా ఛైర్మన్ జెసి రాజు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రోటరీ కార్యాలయంలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను నిర్వహించారు. తెలుగుభాష అభివృద్ధికి రచనలు చేస్తున్న ఐదుగురు రచయితలకు సత్కరించారు.
TPT: తిరుపతి పట్టణంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 28, 29 తేదీలలో రెండు రోజులపాటు స్పీడ్ స్కేటింగ్ పోటీలు ఘనంగా జరిగాయి. ఏపీ స్పీడ్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. 200 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఇందులో 2025లో మధురైలో జరిగే జాతీయస్థాయి పోటీలకు 50 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు.
VZM: డెంకాడ మండలం పేడాడ గ్రామంలో వైసీపీ నుంచి జనసేనలోకి పలువురు చేరారు. భోగాపురం మండలం ముంజేరులోని జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి జనసేన కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు ఆధ్వర్యంలో ఆదివారం పేడాడకు చెందిన వైస్ సర్పంచి పట్నాల రవి, వార్డుమెంబర్లు పట్నాల గురమ్మ, పిట్ట పద్మ, మిరప అప్పన్న జనసేనలో చేరారు.
KRNL: ST సాధన కోసం ప్రతి ఒక వాల్మీకి సోదరుడు సిద్ధం కావాలని ఏపీ బోయ వాల్మీకి సమితి రాష్ట్ర అధ్యక్షుడు మారెళ్ళ అంజి వాల్మీకి పిలుపునిచ్చారు. తుగ్గలి మండల పరిధిలోని మారేళ్ల గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లి నుంచి ఢిల్లీ వరకు బోయ వాల్మీకి ST అనే నినాదం మార్మోగాలని వాల్మీకిలకు మారెళ్ళ అంజి పిలుపునిచ్చారు.
KKD: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే ఏకైక వ్యవస్థ పాత్రికేయ రంగమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఆదివారం ప్రత్తిపాడులో టీడీపీ వద్ద నిర్వహించిన పాత్రికేయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్ధికి పాత్రికేయులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు పాల్గొన్నారు.
W.G: జిల్లాలో ఇప్పటివరకు 237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఈ సదస్సుల నిర్వహణ ద్వారా ప్రజల నుంచి భూ సంబంధ, రెవెన్యూ శాఖల పరంగా మ్యుటేషన్, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఒక్క రోజు వచ్చిన ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.59,200, పూజలు, విరాళాల రూపంలో రూ.99,852, ప్రసాదాల రూపంలో రూ.1,43,875 స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.