NLR: నూతన సంవత్సర వేడుకల పేరిట ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 31న అర్ధరాత్రి నుంచి యువత బైక్ పై పెద్ద శబ్దాలు చేస్తూ తిరగడం నిషేధించినట్లు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయాలనుకుంటే అనుమతి తీసుకోవాలన్నారు.
SKLM: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేస్తూ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సేవా కార్యక్రమాలకే తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పూల బొకేలు, మిఠాయిలు, సత్కారాలు చేయవద్దని, ఆ ఖర్చుతో పేద విద్యార్థులకు సాయం చేయాలన్నారు.
VSP: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ శివారు దిబ్బపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొరివి మసేను(30) ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. చేపల వేట చేస్తుండగా అలల ఉధృతికి బోటు బోల్తా పడింది. దీంతో గల్లంతైన మసేను మృతి చెందాడు. తోటి మత్స్యకారులు మృతదేహాన్ని సముద్ర తీరానికి తీసుకువచ్చారు.
NDL: ఈ నెల 30వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
చిత్తూరు: ఓల్డ్ డీపీఓ కార్యాలయంలో రేపు జరగాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదివారం సాయంత్రం తెలిపింది. పోలీస్ రిక్రూట్మెంట్ ఎంపికల కారణంగా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చి రావద్దని సూచించారు.
PPM: సీతంపేట ఏజెన్సీ అందాలను మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆడలి వ్యూ పాయింట్, ఎన్టీఆర్ అడ్వాంచర్ పార్క్, బెనరాయి జలపాతాలను సందర్శించారు. ఎన్టీఆర్ అడ్వాంచర్ పార్క్లో పలు సాహస క్రీడలను ఎంజాయ్ చేశారు. హ్యంగింగ్ బ్రిడ్జి, ఆర్చరీ, షూటింగ్ వంటి క్రీడలను చేసి ఆనందంగా గడిపారు.
VZM: జిల్లా ఎస్పీ వాకుల్ జిందల్ ఆదేశాలతో డెంకాడ మండల కేంద్రం పరిధిలో ఉన్న ఎంవిజిఆర్ కళాశాలలో ఎస్సై సన్యాసినాయుడు, సిబ్బందితో ఆదివారం సాయంత్రం యువతకు చెడు మార్గాల వెలితే దానివల్ల జరుగు దుష్పరిణామలపై వీడియో ద్వారా అవగాహన కల్పించారు. యువత చెడు మార్గంవలన జీవితాలు నాశనం అవుతాయన్నారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
VZM: ఈనెల 27న ఎస్.కోట మండలం, దాంపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మంచినీటి సమస్యను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఆదివారం అధికారుల్లో కదలిక వచ్చింది. తక్షణమే బోరును పునరుద్దరించి గ్రామస్తుల దాహార్తిని తీర్చారు.
VSP: సమష్టిగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని ప్రముఖ సినీ నటుడు, మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. బాలభాను పురోహిత , అర్చక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ కంబాలకొండలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకతాటిపై పనిచేయాలని సూచించారు.
KRNL: జిల్లాలలో స్థానిక MLAల ఆధ్వర్యంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ(AMC)ల నామినేటెడ్ ఛైర్మన్ పదవుల నియామకానికి జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా నోటిఫికేషన్ జారీ చేశారు. కర్నూలు(AMC)-OC జనరల్, ఆదోని-BC’s & మైనారిటీస్(ఉమెన్), YMG-BC’s & మైనారిటీస్(జనరల్), ఆలూరు-SC జనరల్, పత్తికొండ-OC జనరల్, కోడుమూరు-OC ఉమెన్, మంత్రాలయం-OC ఉమెన్ ఉన్నాయి.
VSP: సింహాద్రినాధుడు అత్యంత మహిమాన్వితుడు అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రూపొందించిన అప్పన్న అలంకరణలతో కూడిన నూతన క్యాలెండర్ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్యాలెండర్లు భక్తులకు కనువిందు చేస్తాయన్నారు.
ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం పాడేరు మండలంలోని మారుమూల గ్రామమైన బొడ్డాపుట్టు పీవీటీజీ గ్రామంలో పేద గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. చలికాలం కావడంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేశామని సొసైటీ వైస్ ఛైర్మన్ గంగరాజు తెలిపారు.
PLD: బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు లేవని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేడుకల పేరుతో అశ్లీల నృత్యాలకు అనుమతిని ఇవ్వడం లేదన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు వద్దన్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
E.G: సోమవారం యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పీజిఆర్ఎస్ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం ఆమె ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ELR: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ.10,000 ఇవ్వాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నాగమణి కోరారు. ఏలూరులోని CITU జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన యూనియన్ సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.3,000 వేతనాలు గత ఐదు నెలలుగా బకాయిలు ఉన్నట్లు చెప్పారు.