గుంటూరు: పొన్నూరు పట్టణంలో ఆదివారం చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. నిడుబ్రోలుకు చెందిన గట్టినేని హైమావతి స్థానిక పశువుల వైద్యశాల వద్ద ఉన్న చర్చికి వెళ్తుంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లారు. గొలుసు విలువ సుమారు రూ. 3లక్షలు ఉంటుందని అంచనా.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KDP: విజయవాడలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు ఆరవ రచయితల మహాసభలో పులివెందుల ప్రాంత రచయితలు పలువురు పాల్గొన్నారు. పులివెందులకు చెందిన మరక సూర్యనారాయణ రెడ్డి, నక్కలపల్లె కొండారెడ్డి, బలపనూరు రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలలో మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసి రెడ్డి పాల్గొని తెలుగు భాష గురించి గొప్పగా చాటి చెప్పారు.
NLR: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ పరిశీలకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి దక్షిణ మధ్య రైల్వే బోర్డ్ సభ్యులు స్వర్ణ వెంకయ్య 2025 నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని ఆదాల క్యాంపు కార్యాలయంలో ఆయన్ను సత్కరించి, జ్ఞాపికను అందించారు. విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డికి 2025 నూతన సంవత్సరం ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కసాపురం రమేష్ హాజరయ్యారు. అనంతరం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 54 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న సంఘం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అన్నారు.
VZM: జిల్లాలో స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ అభ్యర్థులకు PMT, PEET పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని రకాలైన ఏర్పాట్లును పూర్తి చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం తెలిపారు. ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా జిల్లాలో 9152 మంది అభ్యర్థులకు పరీక్షలును డిసెంబరు 30 నుండి జనవరి 22 వరకు పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.
KDP: శ్రమ నీ ఆయుధం అయితే – విజయం నీ బానిస అవుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు అన్నారు. కడపలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. తన కుమార్తెలు ఇద్దరు MD చేసి డాక్టర్లుగా ఉన్నారని, మీరు కూడా కష్టపడి ఎదగగాలి, మనతో పాటు మన తోటి వారి ఎదుగుదలకు తోడ్పడాలి అని అన్నారు.
చిత్తూరు జిల్లాలో 2, 67,240 మంది పెన్షన్దారులకు రూ. 113.49 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్లు జనవరి 1వ తేది నూతన ఆంగ్ల సంవత్సరం కావడంతో డిసెంబర్ 31వ తేదీ ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
W.G: వైసీపీ పోరుబాట చేసినా.. పార్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం తాడేపల్లిగూడెంలో మంత్రి మాట్లాడుతూ.. 2014 -19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో 2019 – 2024 మధ్య విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు సైతం బేరీజు వేసుకునే పరిస్థితి ఉందన్నారు. 2014లో చంద్రబాబు విద్యుత్ నిరాటంకంగా అందించారన్నారు.
NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25, 26, 27, 28, 29వ డివిజన్లలోని వేదాయపాళెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా లింగాల రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వేదాయపాళెంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. తనకు ఏకగ్రీవంగా అవకాశం కల్పించిన నాయకులు, కార్యకర్తలకు రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని రెండో వార్డులో ఆదివారం పక్కా గృహాల మంజూరుకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలకు టీడీపీ నాయకులు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. పేదవాని సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
CTR: నూతన సంవత్సర వేడుకల పేరిట నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 31వ తేదీ అర్ధరాత్రి నుండి యువత బైక్‌లపై పెద్ద శబ్దాలు చేస్తూ తిరగడం నిషేధించడం జరిగిందని, బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయాలనుకుంటే డీఎస్పీ అని తీసుకోవాలన్నారు.
VZM: బొండపల్లి మండలంలోని బిల్లలవలస గ్రామంలో టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం బిల్లలవలస గ్రామ సర్పంచ్ నెట్టి యేసురత్నం, మాజీ సర్పంచులు నెట్టి ఆనందరావు, బూర్లి అనురాధ ఆధ్వర్యంలో 250 కుటుంబాలు టీడీపీలో చేరారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
SKLM: జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ సభ్యులుగా ఎంపికైన వాబ యోగి, కళింగపట్నం అప్పన్న ఆదివారం మబగాంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నరసన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వారుని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజలు తమ కాలనీల్లో ఉన్న స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకురావచ్చని కమిషనర్ రవీంద్రబాబు సూచించారు.
W.G: భీమవరం యూటీఎఫ్ ఆఫీసులో ప.గో, కోనసీమ జిల్లా నుంచి హైస్కూల్ ప్లస్‌లో పనిచేస్తున్న పీజీటీల సమావేశం ఆదివారం యూటీఎఫ్ కార్యాలయంలో చింతపల్లి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా హైస్కూల్ ప్లస్ వ్యవస్థను కొనసాగించడానికి కృషి చేస్తానని అన్నారు.