విశాఖలో ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు MVP పోలీసులు తెలిపారు. మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో MVP పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి శుక్రవారం దాడి చేసినట్లు పేర్కొన్నారు.
VSP: వాల్తేర్ డివిజన్లో సాంకేతిక కారణాలతో పలు రైళ్ల గమ్యం కుదించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-పార్వతీపురం(67287/88)రైళ్లు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 విజయనగరం వరకు మాత్రమే వెళ్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురానికి బదులుగా విజయనగరం నుంచి బయలుదేరుతుందన్నారు.
Akp: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పద జాలంతో పోస్టులు పెడుతున్న మడుతూరుకు చెందిన వైసీపీ నాయకుడు గోవిందుపై జనసేన నాయకులు అచ్యుతాపురం సీఐ గణేష్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరును చెడగొట్టాలనే లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తూన్నారన్నారు.
VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల కోడ్ గురించి ప్రతినిధులకు వివరించారు. పలు శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
GNTR: వాట్సాప్ గవర్నెన్స్‌తో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు 161 పౌర సేవలు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా వాట్సాప్‌లోనే సేవలు పొందవచ్చన్నారు.
GNTR: శ్రీ భద్రావతి సహిత భావనాఋషి స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెనాలి షరాఫ్ బజార్‌లోని ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి సాయంత్రం నెమలి వాహనోత్సవం జరిపారు. ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు విశేష వాహన సేవలతో పాటు 3వ తేదీ తెల్లవారుజామున కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
GNTR: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న 38వ జాతీయ క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన కె. నీలరాజు గోల్డ్ మెడల్ సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో నీలరాజు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. క్రీడాపోటీల్లో ప్రతిభ కనపరచిన క్రీడాకారుడు నాగరాజుకు శాప్ ఛైర్మన్ రవినాయుడు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. నీలరాజు విజయం తెలుగువారు గర్వించదగ్గ విషయం అన్నారు.
NLR: గూడూరు పంచాయతీరాజ్ శాఖ ఆఫీసు నందు శుక్రవారం సాయంత్రం నూతన పి.ఆర్.ఐ కార్యనిర్వహక ఇంజనీర్‌గా రవణయ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, ఉమ్మడి నెల్లూరు జిల్లాల పంచాయతీరాజ్ శాఖ అసోసియేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. గూడూరు డివిజన్ నందు మంజూరైన పంచాయతీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
W.G: తణుకు రూరల్ ఎస్సై ఏజిఎస్ మూర్తి ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై బంధువులతో ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పూర్తి స్థాయి విచారణ వేసి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
KKD: నిత్యం కెరటాలతో ఎగిసిపడే ఉప్పాడ సముద్రం తీరం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. గురువారం వరకు పూర్తిస్థాయిలో ఉండగా శుక్రవారం సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందని స్థానిక మత్స్యకారులు వెల్లడించారు. దీనికి కారణం తెలీదంటున్నారు. అయితే వెనక్కి వెళ్లిన సముద్రం ఒక్కసారిగా ముందుకొస్తే ముంపు సమస్య ఏర్పడుతుందని సమీపంగా నివసిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
KKD: గొల్లప్రోలు మండలం ఏ విజయనగరం గ్రామ రెవెన్యూ అధికారి కే.బుచ్చిరాజు పదవి విరమణ సందర్భంగా అభినందన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా రెవిన్యూ విభాగంలో విశిష్ట సేవలు అందించిన బుచ్చిరాజు సహకారం మరువలేనిదన్నారు. బుచ్చిరాజును పదవి విరమణ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఘనంగా సత్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని SFI రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. 28వ జిల్లా మహాసభలు సందర్భంగా శుక్రవారం కడప UTF భవన్లో ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, సొంత భవనాలు నిర్మించాలన్నారు.
W.G: అత్తిలి మండలం మంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈఘటనలో శరీరం నుంచి తల వేరైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేపట్టారు. సుమారు 35 సంవత్సరాల వయసు కలిగిన ఈ వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
NDL: చాపిరేవుల గ్రామంలోని ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రమాదంలో గాయపడి నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న భాదితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారితోపాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ELR: జిల్లా వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా గర్భిణులకు అవగాహన కార్యక్రమాలు, నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరిశీలన వేగవంతం చేయాలన్నారు.