KDP: కమలాపురం మండల పరిధిలోని గొల్లపల్లి సమీపాన శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను బైక్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలకు, ఒక పురుషునికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారు పందిర్ల పల్లె గ్రామ వాసులుగా గుర్తించారు.
KDP: ప్రపంచ పర్యాటక మ్యాపులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుండగా.. మరోవైపు ఒబేరాయ్ సంస్థ ఆతిధ్య సేవల కోసం సిద్ధమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గండికోట పర్యాటక అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
KRNL: ఆదోని మండలం కుప్పగల్ SS ట్యాంక్ నుంచి గనేకల్ టర్నింగ్ వద్ద పైప్‌లైన్ లీక్ అవుతున్న సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే పార్థసారథి అధికారులను ఢిల్లీ నుంచి ఫోన్ ద్వారా ఆదేశించి మరమ్మతులు చేయించారు. శుక్రవారం బీజేపీ అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పైప్‌లైన్ లీకేజీ సమస్య పరిష్కరించామన్నారు. 6 గ్రామాలకు సరఫరా అవుతుందన్నారు.
E.G: ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా పొత్తుల రాజశేఖర్ విజయం కోరుతూ నిడదవోలులో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అద్యక్షుడు కె.ఎస్.జవహర్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే శేషారావు పాల్గొన్నారు. రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
అన్నమయ్య: ముఖ్యమంత్రి రేపు జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సంబేపల్లి మండలంలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు, హెలిప్యాడ్, సంబేపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం, ముఖ్యమంత్రి పర్యటించనున్న పలు ప్రాంతాలలో జిల్లా ఎస్పీ పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరీక్షించారు.
కోనసీమ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఆసక్తి ఉన్న వారు ఓటు నమోదుకు అవకాశం ఉందని మండపేట తహసీల్దార్ తేజేశ్వరరావు శుక్రవారం పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గంలో 7,407 ఓటర్లు ఉన్నారన్నారు. మండపేట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్‌గా ఇంకా నమోదు కానీ వారు ఉంటె ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
E.G: విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించాలని, వారి భవిష్యత్తుకు 10వ తరగతి కీలక మలుపని జిల్లా కలెక్టర్ పీ.ప్రశాంతి అన్నారు. శుక్రవారం గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయంలో జరిగిన ప్రతిభకు ప్రేరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
E.G: శరీరంపై స్పర్శ లేకపోవడం కుష్టు వ్యాధి లక్షణమని, ఈ లక్షణాలు కనిపించిన వారు, శరీరంపై వివిధ రకాల మచ్చలు ఉన్నవారు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని పల్లంకుర్రు పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి డీబీవీ ప్రసాద్ సూచించారు. కందికుప్పలో సర్పంచ్ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుష్టు రహిత మండలంగా చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.
ప్రకాశం: సంతనూతలపాడు మండల సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 4న జరగనుంది. ఈ మేరకు ఎంపీడీవో సురేశ్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీపీ బి.విజయ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు అందరూ హాజరు కావాలని కోరారు. మండలంలో చేపట్టిన, చేపట్టబోయే పనుల గురించి చర్చిస్తామన్నారు.
KDP: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో శుక్రవారం నాటికి 8.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 972.24 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో ఏమి లేదని పేర్కొన్నారు. రిజర్వాయర్ నుంచి దిగువకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కోటపాడు గ్రామం సోమశిల బ్యాక్ వాటర్ సహాయంతో పాటు ఆక్వా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది… సోమశిల బ్యాక్ వాటర్ కోటపాడు రెండు లక్షల చేప పిల్లలను వదలడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఒంటిమిట్ట మండలంలోని కోటపాడు గ్రామం స్టాకింగ్ పాయింట్ నందు సోమశిల బ్యాక్ వాటర్ దగ్గర చెరువులో చేప పంపిణి చేశారు.
ATP: శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పట్టు వస్త్రములను సమర్పించి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ATP: గుంతకల్లు పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులు అంజి, రాజశేఖర్ మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన కళాశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
SKLM: ఆమదాలవలస మండలం చిట్టివలస గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఏడి ఆర్.ఆనందరావు ఆధ్వర్యంలో ఆవులకు, మేకలకు, గేదెలకు వైద్య చికిత్సలు చేశారు. ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల సాగు పై రైతులకు అవగాహన ఆనందరావు అవగాహన కల్పించారు. అనంతరం దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు.
SKLM: రథసప్తమి వేడుకలను జిల్లాలో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా కలెక్టరెట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా తొలిసారిగా హెలికాప్టర్‌ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.