E.G: శరీరంపై స్పర్శ లేకపోవడం కుష్టు వ్యాధి లక్షణమని, ఈ లక్షణాలు కనిపించిన వారు, శరీరంపై వివిధ రకాల మచ్చలు ఉన్నవారు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని పల్లంకుర్రు పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి డీబీవీ ప్రసాద్ సూచించారు. కందికుప్పలో సర్పంచ్ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కుష్టు రహిత మండలంగా చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.
ప్రకాశం: సంతనూతలపాడు మండల సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 4న జరగనుంది. ఈ మేరకు ఎంపీడీవో సురేశ్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీపీ బి.విజయ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు అందరూ హాజరు కావాలని కోరారు. మండలంలో చేపట్టిన, చేపట్టబోయే పనుల గురించి చర్చిస్తామన్నారు.
KDP: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో శుక్రవారం నాటికి 8.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 972.24 అడుగుల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో ఏమి లేదని పేర్కొన్నారు. రిజర్వాయర్ నుంచి దిగువకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అన్నమయ్య: రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కోటపాడు గ్రామం సోమశిల బ్యాక్ వాటర్ సహాయంతో పాటు ఆక్వా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది… సోమశిల బ్యాక్ వాటర్ కోటపాడు రెండు లక్షల చేప పిల్లలను వదలడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఒంటిమిట్ట మండలంలోని కోటపాడు గ్రామం స్టాకింగ్ పాయింట్ నందు సోమశిల బ్యాక్ వాటర్ దగ్గర చెరువులో చేప పంపిణి చేశారు.
ATP: శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పట్టు వస్త్రములను సమర్పించి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ATP: గుంతకల్లు పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో శుక్రవారం విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థి సంఘాల నాయకులు అంజి, రాజశేఖర్ మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన కళాశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
SKLM: ఆమదాలవలస మండలం చిట్టివలస గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ఏడి ఆర్.ఆనందరావు ఆధ్వర్యంలో ఆవులకు, మేకలకు, గేదెలకు వైద్య చికిత్సలు చేశారు. ఏకవార్షిక, బహువార్షిక పశుగ్రాసాల సాగు పై రైతులకు అవగాహన ఆనందరావు అవగాహన కల్పించారు. అనంతరం దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు.
SKLM: రథసప్తమి వేడుకలను జిల్లాలో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా కలెక్టరెట్‌లో శుక్రవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా తొలిసారిగా హెలికాప్టర్‌ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
VZM: బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ సాపు వెంకట మురళీకృష్ణ అద్యక్షతన శుక్రవారం జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వాయిదా పడింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి అభివృద్ధి పనులకు ఆమోదం పొందే అవకాశం లేదు.
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు డా.మామిడి సాయి గణేష్ వివాహం ఫిబ్రవరి 16వ తేదీన జరగనుంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి తప్పకుండా హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు గణేష్ ఉన్నారు.
AKP: నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం అవంతి జూనియర్ కళాశాలలో శుక్రవారం జాతీయ సాంకేతిక సమావేశం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అవంతి సంస్థ ఛైర్మన్ మొత్తం శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాంకేతిక ప్రపంచంలో పోటీ పడాలంటే వినూత్నమైన ఆలోచనతో ముందుకు రావాలని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలని అన్నారు.
E.G: అంతర్వేది కళ్యాణ ఉత్సవాలకు స్పెషల్ బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేయరాదని, అమలాపురం నుంచి మలికిపురం వరకు కాకుండా అమలాపురం నుంచి అంతర్వేది వరకు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు శిరంగు నాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ చర్ల సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.
సత్యసాయి: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఆర్ల శ్రీనివాసులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. కాగా డీఎస్పీగా ఉన్న ఆర్ల శ్రీనివాసులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు ఎస్పీగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే.
VZM: ఎన్టీఆర్ భరోసా ఫించన్లను ఫిబ్రవరి 1,3 తేదీలలో పంపిణీ చేస్తామని వంగర MPDO త్రినాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇతర ప్రాంతాల్లో ఉన్న పెన్షన్ దారులకు ముందుగా పెన్షన్ పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. 2వ తేది ఆదివారం కాబట్టి సోమవారం కూడా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
VZM: త్యాగరాజస్వామి ద్వితీయ ఆరాధన మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాజాం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పడ్డ సంలో శ్రీ నవదుర్గ మాత ఆలయం నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు భక్తులు త్యాగరాజకీర్తనలతో శ్రీ త్యాగరాజస్వామి చిత్రపటాన్ని పట్టుకుని భక్తి భావంతో ఉదయం ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.