PLD: నరసరావుపేట మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండపై కొలువైన త్రికోటేశ్వరస్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబులు త్రికోటేశ్వరుడికి పూజలు చేశారు. అనంతరం వారు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
NTR: రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని దర్యాప్తు అధికారులను బెదిరించడం కోసమే ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని ఆరోపణలు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. బెదిరింపు చర్యలకు పాల్పడిన పేర్ని నానిపై క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసు దర్యాప్తులో అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ELR: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆదివారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రజలు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని స్వయంగా పరిశీలించిన ఆయన వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
SKLM: రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు బత్తల ఆది తల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు ఆదివారం హాస్పిటల్‌కి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
CTR: చిత్తూరు పెన్షన్ భవనంలో చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ సిఎస్సిడిఎస్ సర్వసభ్య సమావేశం తాండవ మూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుడా ఛైర్మన్ కటారి హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీకి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఎన్టీఆర్: తిరువూరు మండలం కోకోలంపాడులో సీపీ ఆదేశాల మేరకు కేటాయించిన డ్రోన్‌ను తిరువూరు ఎస్సై సత్యనారాయణ, సీఐ గిరి బాబు ఆధ్వర్యంలో పరిశీలించారు. గ్రామంలో కోడి పందాలు, పేకాటలు జరగకుండా డ్రోన్ ఎగుర వేసి మొత్తం సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు కూడా తీసుకున్నారు.
VSP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని టీఎన్టీయూసీ డిమాండ్ చేసింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 14117వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో పాల్గొన్న టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బి పైడిరాజు మాట్లాడుతూ.. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలన్నారు.
GNTR: MEF జాతీయ సమావేశానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రానున్నట్లు MEF జాతీయ అధ్యక్షుడు ఆచార్య చిలుమూరి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం గుంటూరులోని మౌర్య ఫంక్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి మాదిగ ప్రముఖులు, యువకులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో MEF, రాష్ట్ర అధ్యక్షులు,ఉన్నారు.
SKLM: జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం యూటీఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు మాట్లాడుతూ.. నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆహ్వానిద్దామన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిద్దామని తెలిపారు. మూఢ విశ్వాసాల నిరోధక చట్టం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
NTR: విజయవాడ నగర ప్రజలకు, పోలీస్ సిబ్బంది, అధికారులు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31వ తేది రాత్రి నిర్వహిచుకొనే వేడుకలకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు తప్పని సరి చేయటమైనదని స్పష్టం చేశారు.
NTR: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నామని విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం ఆయన పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్, గాంధీ నగర్ పరిసర ప్రాంతాల్లో అసాంఘిక శక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తుంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు.
CTR: పుంగనూరు మండలం, చండ్రమాకులపల్లికి చెందిన రైతు కందిరీగల శంకర్(60) ఊరికి సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు పాడి ఆవులను మేతకు తోలుకొని వెళ్ళాడు. అక్కడ చెట్ల పొదల్లో ఉన్న విష సర్పం కాలిపై కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పాము కరిచిందని ఫోన్ ద్వారా కుటుంబీకులకు చెప్పడంతో వారు వచ్చి బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ATP: గుంతకల్లు లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుమార్తె, గుంతకల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నైరుతి రెడ్డి హాజరయ్యారు. రెడ్డి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ELR: దేశ సమైక్యతను, మత సామరస్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని సీపీఎం జిల్లా కార్యదర్శి రవి అన్నారు. ఆదివారం ఏలూరులో నాయకులు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామరస్యం, సమానత్వం ప్రజల నడుమ నెలకొన్నప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు.
BPT: పిట్టలవానిపాలెం గ్రంథాలయ అధికారి మోర్ల శ్రీనివాసరావు భారత్ సేవా సింహం నేషనల్ అవార్డు, జోహార్ లాల్ నెహ్రూ జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సరస్వతి భవన్‌లో ఆదివారం ఈ అవార్డును ప్రముఖ న్యూరాలజిస్ట్ దైవజ్ఞ శర్మ, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, సినీ నిర్మాత మూస అలీ ఖాన్ పలువురు ప్రముఖులు శ్రీనివాసరావుకు అందజేసి గజమాలతో సత్కరించారు.