E.G: అడ్డతీగలలో ఆదివారం నూతనంగా ప్రారంభమైన ఓ ఫ్యామిలీ రెస్టారెంట్ రూ. 10కే బిర్యానీ ప్యాకెట్ ఇస్తుండడంతో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఇంకా ప్రారంభం కాకముందు నుంచి జనం గుమిగూడి క్యూ కట్టారు. ఇతర మండలాల నుంచి బిర్యానీ ప్యాకెట్ కోసం ఎగ. దీంతో అడ్డతీగల వై.రామవరం రూట్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో జోనల్ సమావేశం జరగగా జిల్లా అధ్యక్షులు వాక జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిషన్ను నియమించి 30% మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ విశేష కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ పి.రాజ్ కుమార్, జిల్లా కార్యదర్శి నాయబ్ రసూల్ పాల్గొన్నారు.
ATP: కళ్యాణదుర్గం పట్టణంలో గత టీడీపీ ప్రభుత్వంలో కురుబ కల్యాణ మంటపం నిర్మాణానికి నిధులు కేటాయించారు. అది వైసీపీ ప్రభుత్వం హయాంలో మరుగున పడిపోయింది. తిరిగి ఇప్పడు నిధులు కేటాయించి కల్యాణమంటపం పూర్తికి చర్యలు తీసుకోవాలని కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలాస్వామీ, కురుబ సంఘం నాయకులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుని కలసి వినతిపత్రం అందజేశారు.
ATP: పరిగి మండలం హోన్నంపల్లి గ్రామంలో మంత్రి సవిత ఆదివారం కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని కురుబ కులస్తులు కోరిక మేరకు మంత్రి సవిత తన తండ్రి రామచంద్రరెడ్డి జ్ఞాపకార్థం విగ్రహాన్ని విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పార్థసారథి, కురుబ కులస్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నగర వాసుల వద్ద నుంచి వినతలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.
E.G: కపీలేశ్వరపురం మండలం,కేదార్లంకలో ఇటీవల ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుడు యర్రంశెట్టి కృష్ణ కుటుంబానికి రూ.5లక్షల భీమా చెక్కు రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి, జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శనివారం అందజేశారు. సభ్యత్వం నమోదు చేయించిన వాలంటీర్ యర్రంశెట్టి వీరబాబుకు ఆయన అభినందనలు తెలిపారు.
CTR: శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి యోగ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. డిప్లొమా ఇన్ యోగ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ యోగ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైన మహిళా అభ్యర్థులు అర్హులు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.
గుంటూరు: పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీష్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16శాతం క్రైమ్ రేటు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామని అన్నారు. రోడ్డు యాక్సిడెంట్స్ 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 224మందిని గంజాయి కేసుల్లో పట్టుకున్నామన్నారు.
NLR: సంగం మండల కేంద్రంలోని పెన్నా నది సమీపంలో ఉన్న గిరిజనులకు ఆదివారం పట్టణానికి చెందిన విద్యార్థులు దుప్పట్లను పంపిణీ చేశారు. దాదాపుగా 50 మందికి దుప్పట్లను అందజేయడం జరిగింది. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకొని ఆ నగదుతో గిరిజనులకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
CTR: జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాష వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తే ప్రాణదానం చేసిన వారితో సమానమని పేర్కొన్నారు. రక్తదానం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
GNTR: మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎగువ భాగంలో ఉన్న గండాలయ్య స్వామి ఆలయ దారులన్నీ మూసివేసినట్లు గండాలయ జ్వాల నరసింహ స్వామి వారి భక్త బృందం సభ్యులు ఆదివారం తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా గండ దీపం నిర్మాణ పనులు జరుగుతున్నాయని కావున ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాలనుంచి ఆలయానికి వచ్చే భక్తులు గమనించాలన్నారు.
SKLM: విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ నిర్మూలనపై మహా సంకల్ప అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. ముందుగా 5 కే వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, కలెక్టర్ దినకర్ తదితరులు ఉన్నారు.
ATP: పెనుకొండ మండల కేంద్రంలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మంత్రి సవిత ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి UTF పోరాటాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా నాయకులు జయచంద్ర, సుధాకర్, భూతాన్న, బాబు, నారాయణ స్వామి, 40 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ATP: తాడిపత్రి మండలం ఊరు చింతల గ్రామ సమీపం లో పేకాట ఆడుతున్నట్లు రూరల్ పోలీసులకు శనివారం నాడ సమాచారం అందింది. రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబు, పోలీస్ సిబ్బంది కలిసి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుండి 48 వేల రూపాయలు నగదు 52 పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ముద్దాయిలను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
NLR: ఉమ్మడి జిల్లా వరదయ్యపాళెం మండలం బత్తులవల్లంలో పంట కాలువ స్థలాన్ని ఇష్టానుసారంగా ఆక్రమించిన వైనంతో ప్రజలు విస్తుపోతున్నారు. తడకు చెందిన రెస్టారెంట్ హోటల్ నడుపుతున్న స్థానికేతర వ్యక్తి పంట కాలువ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా భవన నిర్మాణాలను చేపట్టడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశారు.