KKD: కరప మండలం వాకాడ మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వడ్లమూరి శ్రీరామారావు ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ASR: జీ.మాడుగుల మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతానికి అధికారులు కొత్త హంగులు సమకూర్చారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. జలపాతానికి వెళ్లేందుకు టైల్స్‌తో మార్గాన్ని నిర్మించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం రాత్రి సమయంలో జాలువారుతున్న జలపాతం అందాలు మరింత కనువిందు చేస్తున్నాయి.
KDP: సిద్దవటం మండలంలోని సిద్దవటం-బద్వేల్ రహదారి చెక్‌పోస్ట్ వద్ద బుధవారం రాత్రి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి కళావతి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ లక్ష్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అడవి జంతువులు మృత్యువాత పడుతున్నాయని వాహనాలను అతి వేగంగా నడపరాదని ఆమె సూచించారు.
KKD: అవగాహనతోనే ప్రమాదాలకు, నేరాలకు దూరం కాగలమని ఎస్పీ జి.బిందుమాధవ్ అన్నారు. బుధవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో సైబర్ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మనం చేసే పొరపాటు వలన మన కుటుంబంతోపాటు, ఇతరులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
SKLM: సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రాంతాల అభివృద్థి కిచర్యలు తీసుకుంటున్నామని ఇంఛార్జ్ పీవో సి. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 20 సబ్‌ప్లాన్ మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
KDP: వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి రైతులు అవగాహన కలిగి ఉండాలని, మండల వ్యవసాయ అధికారి కే. శ్రీదేవి తెలిపారు. బుధవారం ఆమె మండలంలోని రాచినాయపల్లెలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె రైతులతో మాట్లాడుతూ.. వరిలో కాండం తొలుచు పురుగు అధికంగా ఉన్నందున రైతులు సకాలంలో తగినటువంటి చర్యలు తీసుకోవాలని అన్నారు.
KDP: పర్యావరణ సహితంగా యురేనియం ప్రాజెక్టును నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం వేముల మండలం తుమ్మలపల్లె యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టును ఆయన సందర్శించి, సంబంధిత అధికారులతో ప్రాజెక్టు పనులు, ఉత్పత్తులు, ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గనులలో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు.
VZM: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన చీటింగ్ కేసులో నిందితుడికి ఆరు మాసాల జైలు శిక్ష, రూ.8000 జరిమానాను కోర్టు విధించిందని సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. గజపతినగరం మండలం పురిటిపెంటకు చెందిన చలుమూరి వెంకట భాస్కరరావు ఐటీ మోసానికి పాల్పడడంతో కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ సమయంలో సాక్ష్యాలను ప్రవేశపెట్టామన్నారు.
VZM: కొత్తవలస ఫ్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వేపాడ మండలం కృష్ణరాయుడుపేట గ్రామంలో బుధవారం సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. సిమ్మ ఈశ్వరమ్మ అనే వ్యక్తి వద్ద 5 లీటర్ల నాటుసారా లభ్యమైనట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.ఎస్.రాజశేఖర్ నాయుడు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విశాఖ సెంట్రల్ కారాగారానికి తరలించినట్లు పేర్కొన్నారు.
ATP: గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జయరాం బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిన్నటి దినం మీడియాపై దురుసుగా మాట్లాడిన మాట వాస్తవమే, ఒకటి, రెండు ఛానల్ తప్ప మిగతా మీడియా మిత్రులంతా నా సహోదరులే, నామీద నేర చరిత్ర ఉందో లేదో తెలుసుకుని వార్తలు రాయాలని, ఎలాంటి సాక్షాలు లేకుండా నా మీద అబాండాలు వేయడంతో అలా మాట్లాడానని అన్నారు.
కోనసీమ: శిరస్త్రాణం మీకే కాకుండా మీ కుటుంబ సభ్యుల రక్షణకు సోపానం లాంటిందని MLA బండారు సత్యానందరావు అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బైక్ ర్యాలీలో MLA హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. రోడ్డు భద్రతా అవగాహనలో భాగంగా వాడపాలెం గ్రామం నుండి కొత్తపేట మారుతీ నగర్, కౌశిక రోడ్డు మీదుగా బస్టాండ్ సెంటర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
కోనసీమ: అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా ఇల్లు దగ్ధమై దిగుమర్తి చిట్టిబాబు కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయిల్ బాధితులను పరామర్శించి వారికి బొమ్మి నరసింహమూర్తి మంగయమ్మ ఫౌండేషన్ ద్వారా 25 కేజీలు బియ్యం, రెండు దుప్పట్లు, బట్టలు, కూరగాయలు అందజేశారు.
SKLM: కుంభమేళాకి శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి, ఏ.విజయకుమార్ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో కుంభ మేళాకి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. పూర్తి వివరాలకు 9959225608 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ATP: బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం గ్రామంలో రైతు సూర్యకు చెందిన గడ్డివాముకు బుధవారం గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామస్తులు ఎగసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు రూ.50 వేలు నష్టం వాటిలినట్లు రైతు కన్నీరు మున్నీరయ్యాడు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.