KDP: పిల్లలకు పెద్దలకు సంస్కారాన్ని నేర్పించిన హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలిపాలని కడప అంచల్ అధ్యక్షులు చెన్న కృష్ణయ్య అన్నారు. చాపాడులోని ఆత్మారామ దేవాలయంలో ఆదివారం ఏకల్ పాఠశాల మాసవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎఫ్ మండల కన్వీనర్ సుబ్బరాయుడు, కార్యాలయ ప్రముఖులు సృజన, ఓబులేసు, రామచంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
W.G: నరసాపురంలో జనవరి 14 నుంచి 18తేదీ వరకూ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు గోగులమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. దేశంలో పలు ప్రాంతాల నుంచి 40 స్త్రీ, పురుష జట్లు పాల్గొంటాయన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని జానకీరామ్ కోరారు. విజేతలకు రూ.7.50లక్షలు ప్రైజ్ మనీ ఉందన్నారు.
కృష్ణా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన సంవత్సర మొదటి క్యాలెండర్ ను ఆదివారం విడుదల చేశారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామపంచాయతీ పరిధిలోని వేమవరంలో ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జ్ఞాపికను అందజేశారు.
SKLM: విద్యుత్ ఛార్జీల పెంచిన పాపం జగన్ రెడ్డి దే అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో మీరే విధ్యుత్ చార్జీలు పెంచి, మీరే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడమే కాదా అని అన్నారు. వైసీపీ నాయకులు చేసిన పాపం కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం సరి కాదు అని అన్నారు.
GNTR: గుజ్జనగుండ్లలో లూథరన్ చర్చి వద్ద ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి నష్టపోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆర్థికసాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు దుస్తులు, పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచిన బాధితులకు తనవంతుగా ఆర్ధిక సహాయాన్ని అందజేశామన్నారు.
ASR: డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి భూములు మేము ఇస్తే ఉపాధి అవకాశాలు వేరే మండలం వారికి కల్పించడం సరికాదని స్థానిక సొంతవలస గ్రామం భూవిరాళ దాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని నిర్మాణం జరుగుతున్న ఏకలవ్య పాఠశాలకు సంబంధించి భూమి దాతలు నిర్మాణం జరుగుతున్న పాఠశాల ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
NTR: మైలవరంలోని లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. టెక్నో టాస్క్, బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు పాల్గొంటాయన్నారు.
CTR: పిచ్చాటూరులో ఆదివారం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ దుస్థితిని పరిశీలించారు. అనంతరం హాస్టల్లో ఉన్న బాలికలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
TPT: తిరుపతి SP కార్యాలయంలో సోమవారం జరిగే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ రద్దయినట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ప్రజలు సమస్యలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మళ్లీ ఎప్పుడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను ఏర్పాటు చేసేదే చెబుతామమని వారు తెలిపారు.
కృష్ణా: మంత్రి కొలుసు పార్థసారథి వస్తున్న నేపథ్యంలో జిల్లా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఆదివారం చాట్రాయి మండలం చిన్నంపేటలో జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య శిబిరం సందర్శనకు మంత్రి కొలుసు వస్తున్న నేపథ్యంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.
ప్రకాశం: ఒంగోలు నగరంలోని 33వ వార్డులో ఉన్న కొత్త డొంక దురాక్రమణకు వ్యతిరేకంగా ఆదివారం స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఆ పక్కన ఉన్న నివాస గృహాలలోకి నిర్మాణాలు చేయడం తగదన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే 15రోజులలో పరిష్కారం చేయాలని నగర కమీషనర్ ఆదేశాలిచ్చినా పట్టించుకోలేదన్నారు.
GNTR: రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలిపించాలని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. గుంటూరు అంబేద్కర్ భవన్లో SC, ST, BC రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాడ్యుయేట్, కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎన్నికల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలలో రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
NTR: చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంలో కుక్కల బెడద రోజురోజుకి ఎక్కువైపోతుంది. ఈ మార్గం గుండా చర్చి ఉండటంతో ప్రేయర్‌కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలు వెంట పడటం వల్ల పలుమార్లు బైక్ స్కిడ్ అయి ప్రమాదాలు జరిగాయని వాహనదారులు వాపోయారు. వెంటనే స్పందించి అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారు.
GNTR: జిల్లా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. 31న రాత్రి 11గంటల వరకు దుకాణాలు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న దుకాణాలు, ఈవెంట్స్ ఒంటిగంట వరకు ఉంటాయని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, మద్యం తాగడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ATP: గుత్తిలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఆదివారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రజా సంఘాల నాయకులు నిర్మల, విజయ్ మాట్లాడుతూ.. డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు గుత్తి పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.