PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు వీరఘట్టం మండల కేంద్రం బీసీ కాలనీలో ఇంటర్మీడియట్ చదువుతున్న17 ఏళ్ల బాలికకు బాల్య వివాహం చేస్తున్నారన్న పాలకొండ శక్తి టీంకు సమాచారం వచ్చింది. అక్కడ జరుగుతున్న బాల్య వివాహాన్ని శక్తి టీం అడ్డుకుంది. బాలికకు, తల్లిదండ్రులకు బాల్య వివాహం చేయడం చట్టరీత్య నేరం అని తెలిపారు. దానివల్ల జరిగే అనార్థాలపై అవగాహన కల్పించారు.
కోనసీమ: జిల్లాలో కొబ్బరి ధర రోజు రోజుకి దిగజారుతుంది. గత నెలలో రూ.22 నుంచి రూ.24 వరకు పలికిన కొబ్బరిధర ఆదివారంకి రూ.12 నుంచి రూ.14 కి పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రావడం లేదని అంటున్నారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో విదేశాలకు ఎగుమతి లేకపోవడంతో కొబ్బరి ధర పడిపోయిందని వ్యాపారస్తులు చెప్తున్నారు.
VSP: సింహాచలం వరాహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఆదివారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.
VZM: బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో రైల్వే రక్షక దళం పోస్ట్‌ను వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర ప్రారంభించారు. నూతన భవనంలో ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడానికి అత్యంత సదుపాయాలతో కూడిన సీసీ కెమెరాలు, రిసెప్షన్ సెంటర్, నేరాలు అరికట్టేందుకు నిరంతరం పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఫ్ ఐజీ అలోక్ బోహ్ర, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
KDP: YVUలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో “నెక్స్ట్ జన్ జీఎస్టీ సంస్కరణలు” (జీఎస్టీ 2.0) సెమినార్ జరగనుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో స్థోమత, ఉపాధి, ఆరోగ్యం, స్థిరత్వం.. వికసిత్ భారత్‌పై ప్రభావం (GST ఏఈహెచ్ఎస్-2026) అనే అంశంపై 2 రోజుల జాతీయ సెమినార్ ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ పి.సరిత తెలిపారు.
PKSM: చీమకుర్తిలో శ్రీ భావన ఋషిస్వామి దేవస్థానంలో రామతీర్థం గంగమ్మ తల్లి తిరుణాల సందర్భంగా పద్మశాలి అన్న సత్రం కరపత్రాలను ఆవిష్కరించారు. మొదట కరపత్రాలను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పట్టణ పద్మశాలీల సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
KRNL: ఆన్‌లైన్ పెట్టుబడి పేరుతో సైబర్ మోసం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలవీరాంజనేయులు అనే వ్యక్తిని ఫైయర్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయమైన నేరగాళ్లు షేర్ ట్రేడింగ్‌లో లాభాల మాయతో నమ్మబలికారు. తొలుత లాభాలు చూపించి విశ్వాసం కల్పించి, అనంతరం రూ.14.04 లక్షలు తమ ఖాతాలకు జమ చేయించారు.
TPT: సూళ్లూరుపేట మండలం కే.సీ.యన్ గుంటకు చెందిన తుమ్మ వెంకటరమణయ్య మరణించగా, ఆయనకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన యాక్టివ్‌గా ఉండటంతో కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది. కెనరా బ్యాంకు ద్వారా క్లెయిమ్ చేసి రూ. 2 లక్షల బీమా మొత్తాన్ని ఆయన భార్య సుప్రియకు అందజేశారు. తిరుపతి సర్కిల్ అధికారుల చేతుల మీదుగా ఈ చెక్కు అందించారు.
ATP: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ విమర్శించారు. సింగనమల నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎకరాకు రూ. 40 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలగూడెం, ఇందిరమ్మ కాలనీలో ఇవాళ తెల్లవారు జామున ట్రైనీ ఐపీఎస్ జయశర్మ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. కాలనీలోకి వచ్చే కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తుల కదలికల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
NDL: చాగలమర్రి మండలం రాంపల్లి-నేలంపాడు మధ్య ఇవాళ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహబూబ్ బాషా (28) తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుడి కాలు, కుడి చేతి వేళ్లు విరిగాయి. స్థానికులు 108 ద్వారా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు జంగాలపల్లి నుంచి చాగలమర్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
SKLM: హిర మండలానికి చెందిన ఓ మహిళను పోలాకి M అంబెరు పేటకు చెందిన దుర్గారావు ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుర్గారావుపై అట్రాసిటి కేసు నమోదు చేసి టెక్కలి డీఎస్పీ దర్యాప్తు చేపట్టారు. దుర్గారావును అరెస్టు చేసి శ్రీకాకుళం కోర్టులో హాజరుపరచగా..14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు.
PLD: నరసరావుపేటలో గ్యాస్ కొరత తీవ్రమైందని, దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు నడిపే చిన్న చిన్న హోటళ్లు మూతపడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 1000 ఉండాల్సిన సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో రూ.3,500లకు చేరుకుందని ఆయన విమర్శించారు. గ్యాస్ సరఫరా విషయంలో సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
VSP: ఎయిర్ పోర్ట్ జోన్ సీఐ శంకర్ నారాయణ ఆదేశాలతో ఎస్సై నాగమణి సిబ్బందితో కలిసి ఇవాళ విమానగర్‌లో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
KDP: కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కు మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో ‘న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు’ అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.