BPT: బాపట్లలో పేరం గరుడాచలం నాయుడు సేవలను ప్రముఖులు కొనియాడారు. ఆదివారం తూర్పు సత్రం వద్ద ఆయనకు నివాళులర్పించారు. పేదల కోసం ఆస్తినంతా దానం చేసిన ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. చీలు రోడ్ సెంటర్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మను, తులసి రామచంద్ర ప్రభు, ఉగ్గిరాల సీతారామయ్య అభినందించారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.