ASR: అరకులోయ పోలీస్ స్టేషన్ను ఆదివారం పాడేరు డీఎస్పీ అభిషేక్ సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు పెండింగ్ కేసులను పూర్తి చేయాలని డీఎస్పీ ఆదేశించారు. గంజాయి సాగు, రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని, రహదారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ ఎల్ హిమగిరి, ఎస్సై జీ గోపాలరావులను ఆదేశించారు. వాహన తనిఖీలు పటిష్టంగా చేపట్టాలని అన్నారు.