CTR: రొంపిచర్ల మండలానికి వచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రజలు తమ సమస్యలు తెలియజేశారు. నడింపల్లిలో ఉచిత మినరల్ వాటర్ సరఫరా పథకానికి కాయిన్ బాక్స్ అమర్చారని గ్రామస్థులు కోరారు. పోలీసులు తప్పుడు సారా కేసు పెట్టారని తెలిపారు. బండ వేలం పెట్టాలని అధికారులు ఆదేశించారని వడ్డెరలు ఆవేదన వ్యక్తం చేశారు.
NLR: ఉదయగిరి పట్టణంలోని నాలుగు కాళ్ల మండపం వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉదయగిరి డిపో నుంచి పంచాయతీ బస్టాండ్‌కు వస్తున్న బస్సు తగిలి ఓ వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వృద్ధుడిని ఉదయగిరి ఆసుపత్రి తరలించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గత కొద్ది నెలలుగా ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ మెయిన్ రోడ్డుపై ట్రఫిక్ తీవ్రంగా ఉందన్నారు.
ATP: ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రేపు ఉరవకొండ మండలానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు డ్రిప్ & స్ప్రింక్లర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం రాగులుపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి హంద్రీనీవా కాలువ వెడల్పు పనుల పరిశీలన కార్యక్రమంలో పయ్యావుల కేశవ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు.

ATP: నార్పల మేజర్ పంచాయతీ ప్రజలు ఇంటి, కొళాయి పన్నులు చెల్లించాలని నార్పల పంచాయతీ సెక్రటరీ శ్యామల తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మేజర్ పంచాయతీలోని పలు దుకాణాల వ్యాపారులు తప్పనిసరిగా తమ తమ దుకాణాలకు లైసెన్సులు రెన్యువల్ చేసుకొని పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

CTR: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ని విజయవాడలోని ఆయన స్వగృహంలో ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పాలసముద్రం(మం), ఆముదాలలో 132/33 సబ్ స్టేషన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా.. సబ్ స్టేషన్‌ను మంత్రి మంజూరు చేశారు.

TPT: తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహణలోని 19 రోడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరిశీలించారు. రుయా ఆస్పత్రి సర్కిల్ నుంచి అన్నారావు సర్కిల్, కపిలతీర్థం నుంచి లీలామహల్ సర్కిల్, మంగళం రోడ్డు, లక్ష్మీపురం సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే రోడ్లను పరిశీలించారు. రోడ్ల మరమ్మత్తులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ELR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ చింతలపూడి సీఐ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేపడుతున్నట్లు జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మేక ఈశ్వరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే కేసు పెట్టినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు.
ELR: మంగళగిరి ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను ఏలూరు బహుజన సేనాని మత్తే బాబి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, రద్దు చేసిన 26సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్దించాలని, బహుజనుల సమస్యలతో కూడిన వినతులను అందజేశారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు.
W.G: ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని వచ్చే నెల 1 నుంచి ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు వాడకం నిషేధిస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్‌లో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ పాలిథిన్, ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని ఆయన కోరారు.
ELR: స్టూడెంట్‌ను పెళ్లి చేసుకోవాలని ఓ టీచర్‌కు వచ్చిన ఆలోచన విచారణ దాకా వెళ్లింది. కైకలూరు పరిధిలో పనిచేసే టీచర్ 10వ తరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె పెద్దలతో మాట్లాడాడు. ఈక్రమంలో అక్కడ గొడవ జరగ్గా.. బాలిక బంధువులు టీచర్‌పై HMకు ఫిర్యాదు చేశారు. దీంతో డీవైఈవో పాఠశాలలో విచారణ చేపట్టారు. ఆ టీచర్‌పై వేరు వేరు ఫిర్యాదులు ఉన్నట్లు తేలింది.
CTR: గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో దొంగలు పడ్డారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఇన్స్పెక్టర్ వాసంతి ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న దిగవూరులోని GS భాను ప్రకాశ్ ఇంట్లో కూడా దొంగలు పడి విలువైన ఆభరణాలను దోచుకెళ్లినట్లు సమాచారం.