E.G: రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చియ చౌదరి మద్దుకూరి సుధీర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆకస్మికంగా మృతి చెందిన సుధీర్ చిత్రపటానికి నివాళు అర్పించారు. ఎమ్మెల్యే స్థానిక సొసైటీ బీమా నుంచి మంజూరైన రూ.25 వేల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APTDC వాసిరెడ్డి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 12 వరకు ప్రక్రియ సాగనుంది. ఇందుకు సంబంధించి కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేర్వేరు జిల్లాలకు చెందిన జవాబు పత్రాలను కాకినాడుకు చేర్చారు.
PLD: మాచవరం మండల CPM కార్యదర్శి, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు బ్రహ్మనాయుడు ఆదివారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పార్టీలో కొనసాగుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బ్రహ్మనాయుడు మృతి పార్టీకి తీరని లోటని CPM జిల్లా కార్యదర్శి గోపాలరావు, CITU కార్య దర్శి శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
AKP: దొండపూడి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు బ్యాగులతో గంజాయి తరలిస్తున్న ఇద్దరు అనుమానితులు కనిపించారు. పోలీసులను చూసి బ్యాగులు వదిలి పారిపోవడంతో శనివారం ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగుల్లో 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందినవారని పోలీసులు తెలిపారు.
W.G: రాష్ట్రంలో తొలిసారిగా బలుసులమ్మ వారి ఉగాది ఉత్సవ జాతర 5కిలో మీటర్ల మేర రెండు వేల మంది కళాకారులతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలమంది మహిళలు పాల్గొన్నారు. గ్రామ పొలిమేరల వరకు ఊరేగింపు సాగింది. వీధులన్ని జానాలతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదయ్యింది. బాణాసంచాతో రాజస్థానీ నృత్యాలు చేశారు.
CTR: పూతలపట్టు(M), పి.కొత్తకోట సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి(45)అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్(23), పావని (10), మహాలక్ష్మీ(12), తుషార (4)లకు తీవ్ర గాయాలయ్యాయి.
NDL: నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు PS పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని SI మణికంఠ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్‌తో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. జూదం ఆడటం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వంటివి చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ATP: గుత్తి కోటలోని కొండపై వెలసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం అద్భుతం జరిగింది. స్వామివారి పాదాలను తొలి సూర్య కిరణాలు తాకాయి. ముందుగా ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాలను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ATP: మార్కెట్ యార్డ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అనంతపురం మార్కెట్ యార్డులో 2025 – 26 సంవత్సరానికి చీనీ మార్కెట్ ద్వారా రూ.1,96,55,420 వసూలు అయ్యింది. పశువులు జీవాలు సంత ద్వారా రూ.1,95,11,990 రుసుము రాగా.. మొత్తం రూ.4,35,90,521 ఆదాయం వచ్చిందన్నారు.
తిరుమలలో పోటెత్తిన భక్తుల రద్దీ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా యాత్రికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. గదులు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది భక్తులు ఆలయం పరిసర ప్రాంతాల్లోనే రాత్రి సేద తీరారు.
కోనసీమ: నిద్రమత్తు వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా SP రాహుల్ మీనా ఆదేశాలతో పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అమలాపురం ‘స్టాప్ వాష్ అండ్ గో’ పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున జాతీయ రహదారులపై వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగిస్తున్నారు. లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను నిద్రమత్తు నుంచి అప్రమత్తం చేస్తూ పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు.
GNTR: పెదనందిపాడు మండలం నాగులపాడుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వీరభద్రయ్య (80) బ్రెయిన్ స్ట్రోక్‌తో శనివారం కన్నుమూశారు. పురుగు మందుల వ్యాపారంతో మొదలుపెట్టి, కాటన్ జిన్నింగ్ మిల్లు స్థాపించి ఆయన మంచి గుర్తింపు పొందారు. గతంలో మిల్లు ప్రమాదంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఎంతో మందికి ఉపాధి కల్పించి నిబద్ధత గల వ్యాపారవేత్తగా నిలిచారు.
WG: ఆకివీడులో చికెన్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇవాళ కిలో చికెన్ ధర రూ.380కి చేరింది. ఐదు రోజుల క్రితం రూ.340 ఉన్న ధర, త్వరలోనే రూ.400 దాటుతుందని వ్యాపారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలతో మాంసప్రియులు బెంబేలెత్తుతున్నారు. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకు లభిస్తున్న కోడిగుడ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.
PLD: రెంటచింతల (M) మిట్టగుడిపాడు సమీపంలో గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అధికారులను ఆదేశించారు. గత DEC 24న భూమిపూజ నిర్వహించినా, ఇప్పటికీ మొదలుకాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ITDA DE రియాజుద్దీన్‌ను వివరణ కోరారు. ఆదివారం స్వయంగా నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తానని ఆయన స్పష్టం చేశారు.