విజయవాడకు చెందిన చీకుర్తి స్వాతికి మూడేళ్ల దేవాల్ష్ అనే బాలుడు ఉన్నాడు. ఆగస్టు 31వ తేదీన బాలుడికి తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
అనంతపురం: గుత్తిలోని హజరత్ సయ్యద్ వలి భాషా ఖాద్రీ రహమతుల్లా అలైహి 677వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నిషాన్ జండా, సోమవారం గంధం, మంగళవారం ఉరుసు, బుధవారం జియారత్‌తో ఈ ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయని దర్గా కమిటీ అధ్యక్షుడు కేఎస్ ఉమర్, కేఎస్ మైను మీడియాకు తెలిపారు.
KDP: మహిళల సమస్యలపై పాలకులు, పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ఎల్ఐసీ కడప డివిజన్ యూనియన్ జోనల్ ఉపాధ్యక్షురాలు ఎం కామేశ్వరి అన్నారు. కడపలో శనివారం జరిగిన సమావేశంలో LIC మహిళా శ్రామిక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప డివిజన్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎల్ఐసీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
కడప: పొరుమామిళ్ళలో రోడ్డు ప్రమాదంలో ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే పొరుమామిళ్ళ గ్రామానికి చెందిన మాలిక్ బాషా (35) స్కూటర్ పై వెళ్తుండగా మొలకత్వ సమీపంలో స్కూటర్‌ను లారీ ఢీ కొనడంతో మాలిక్ భాషాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా ప్రబుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల ప్రాంతాలలో స్వచ్ఛతాహి సేవ స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేవస్థానానికి సంబంధించిన వసతి గదుల పైకప్పులను శుభ్రం చేస్తున్న పనులను ఆలయ ఈవో భద్రాజి పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
GNTR: పొన్నూరు మండలం ఆరెమండ పోస్ట్ ఆఫీస్‌లో ప్రజలు దాచుకున్న సొమ్ము గోల్ మాల్ అయిన సంఘటన చోటు చేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా పోస్ట్ ఆఫీస్‌లో అవకతవకులు జరిగినట్లు గుర్తించినట్లు అధికారులు శనివారం తెలిపారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తన పరిధిలోని ప్రజల నుంచి సేకరించిన నగదును పాస్ పుస్తకాల్లో జమ చేయలేదని దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు.
శ్రీకాకుళం: రైల్వే గేటు మరమ్మత్తులు పూర్తి కావడంతో రాకపోకలు యధాతధం చేశారు అధికారులు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి ఊసావానిపేట సమీపంలో గల రైల్వే గేట్ వద్ద గత రెండు రోజులుగా చేపట్టిన మరమ్మత్తు పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫలితంగా ఆదివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరణ చేశామని అన్నారు. వాహనదారులు ఇట్టి విషయాన్ని గమనించాలని కోరారు.
AKP: పెందుర్తి మండలానికి సంబంధించిన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ఈ నెల 24, 25 తేదీల్లో వి. జుత్తాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు ఎస్బీ.వి. సత్యకుమార్ తెలిపారు. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, చదరంగం, యోగా, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాల కోసం మండల క్రీడల సమన్వయకర్తలను సంప్రదించాలన్నారు.
విశాఖ: అనంతగిరి మండలంలోని బొర్రా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (ఎల్ఎఫ్ఎల్) కిరసాని రామారావు శనివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. కించుమండ గ్రామానికి చెందిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.
GNTR: తెనాలి డివిజన్‌లో వర్షాలు, వరదలకు 9078 కుటుంబాలు నష్టపోయాయని, సమగ్ర వివరాలు నివేదికల రూపంలో చేరాయని సబ్ కలెక్టర్ సంజన సిన్హా ఆదివారం తెలిపారు. 173 ఇళ్లు పూర్తిగా, 527 నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 204 పూరి పాకాలకూ నష్టం వట్టిలిందని, వీటి అన్నింటికి నిర్దేశించిన నిబంధనల మేరకు రూ.3.58 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని నివేదిక పంపామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం మండలంలోని మూలపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3,725 కిలోలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. అక్రమంగా నిల్వ చేశారని తెలుసుకున్న అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మూలపాడులోని 49వ షాపుకు తరలించారు.
కృష్ణా: కొత్త చట్టాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ కోరారు. నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలు ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యతతో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
VSP: పెందుర్తి మండలం పాపయ్య రాజుపాలెంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయిస్తున్నట్లు 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం చేపట్టిన రహదారి పనులను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంక్రీట్ పనులు చేపట్టి వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
ఎన్టీఆర్: తిరువూరు పట్టణ పరిధిలోని రాఘవ ఎస్టేట్ ఏరియాలో ఓ వ్యక్తి అధికారుల కళ్లుగప్పి అక్రమ రేషన్ బియ్యం తరలించారు. శనివారం స్థానికులు మిల్లులో రేషన్ బియ్యం లోడింగ్ అవుతుండగా వీడియో, ఫొటోలు తీసి సమాచారం అందించారు. ఇప్పటి వరకు అక్రమ రేషన్ వ్యాపారం చేస్తున్న వ్యక్తిపై ఒక్క కేసు కూడా లేకపోవడం పలు అనుమానాలు గురి చేస్తుందని స్థానికులు వాపోయారు.
KDP: విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం పులివెందుల వైసీపీ నాయకులు సేకరించిన నిత్యావసర సరుకులను శనివారం సాయంత్రం పంపిణీ చేశారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర నూర్ బాషా సంఘం అధ్యక్షులు, ఓతూరు రసూల్ విజయవాడలోని పాయకపురం, జక్కంపూడి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.