ఏపీ హైకోర్టులో నారా లోకేశ్‌కు ఊరట లభించింది. స్కిల్ స్కామ్‌లో ముందస్తు బెయిల్ లభించింది. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ పిటిషన్ విచారణ 4వ తేదీకి వాయిదా పడింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈకేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇస్తామని, నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే 41ఏ నోటీసుల నేపథ్యంలో అరెస్టు ప్రస్తావన రాలేదు. ఈ క్రమంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణన...
ఏపీలో మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది.
త్వరలోనే స్కిల్ స్కామ్‌లో బ్రహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర మళ్లీ వాయిదా పడింది. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు వాదనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది.
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 3వ తేదికి వాయిదా వేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా నారాలోకేశ్ పేరును నమోదు చేసింది. దీంతో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెబుతూ ఆయన జాతీయ మీడియా ద్వారా తన సందేశాన్ని వినిపిస్తున్నారు. యువగళం పాదయాత్రను ఎల్లుండి నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి
ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రత్యక్షమయ్యారు
వచ్చే 6 నెలలు చాలా కీలకం అని.. నేతలంతా ప్రజలతో ఉండాలని ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు.
సీఎం జగన్‌కు రిటర్న్ గిప్ట్ తప్పకుండా ఇస్తామని టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పష్టంచేశారు.
విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలముకోవడంతో ప్రయాణికులు రైలు నుంచి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసినప్పటికీ మరోసారి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.
జైలులో దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనక కన్ను కొడతారా అంటూ చంద్రబాబుపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీ వైపు మజ్లిస్ పార్టీ చూస్తోంది. అక్కడ కూడా పార్టీ విస్తరించాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో రేపు విచారణకు రానుంది. ఈ మేరకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై రేపు విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ నుంచి ముందుస్తు పర్మిషన్ తీసుకోకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని నాయుడు తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.