• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

ATP: గుంతకల్లు పట్టణ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను శనివారం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై రాఘవేంద్ర మాట్లాడుతూ.. పామిడి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా గుంతకల్‌కు ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశామని తెలిపారు.

September 22, 2024 / 06:32 AM IST

రూ.3 లక్షల ఉపాధి నిధులు దుర్వినియోగం

GNTR: రొంపిచర్ల మండలంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి చేపట్టిన ఉపాధి పనుల్లో సుమారు రూ.3 లక్షల నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రజావేదికలో సామాజిక తనిఖీ బృందం వెల్లడించాయి. మరో రూ.6 లక్షల ఉపాధి నిధులు వినియోగంపై విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. రూ.9.25 కోట్లతో చేపట్టిన 602 పనులకు, సంబంధించి సోషల్ ఆడిట్ బృందాలు గ్రామాల్లో తనిఖీలు చేశారు.

September 22, 2024 / 06:29 AM IST

100 రోజుల ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్యే ప్రచారం

విజయనగరం: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కిచ్చాడ గ్రామంలో 100 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఇంటింటికీ వెళ్లి తెలియజేశారు. అనంతరం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య, టీడీపీ నాయకులు సుకేష్‌ చంద్రపండ, కర్రీ శ్రీనివాసరావు ,ఆకుల రమేష్‌ పాల్గొన్నారు.

September 22, 2024 / 06:29 AM IST

రేపు జిల్లా బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపికలు

కోనసీమ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం రామచంద్రపురంలోని కంతేటి పేర్రాజు క్రీడా ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు 2011 జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టిన వారి అర్హులని తెలిపారు.

September 22, 2024 / 06:25 AM IST

గుత్తిలో అర్ధరాత్రి కుండపోత వర్షం

ATP: గుత్తి పట్టణంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుత్తి ఆర్ఎస్, జెండా వీధిలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడింది.

September 22, 2024 / 06:23 AM IST

వాణిశ్రీ పురస్కార గ్రహీతకు ఘన సన్మానం

ప్రకాశం: ముథోల్‌లో కవి, రచయిత జాదవ్ పుండలిక్ రావు రూపొందించిన మధురవాణిలో రెడ్ల బాలాజీ శతక కవితలు రాసినందుకు ఆయనకు వాణిశ్రీ పురస్కారం ప్రకటించారు. ఆ సందర్భంగా తపాలా ఉద్యోగులు ఎస్పీఎం గంగయ్య బాలాజీని ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బాలాజీ రాసిన మధురవాణితో పాటు చిత్ర మధురవాణి, చరిత్ర, గీతశక్తి, వసుధవాణిలో శతక కవితలు రాసి పలువురి కవుల మెప్పు పొందారని అన్నారు.

September 22, 2024 / 06:22 AM IST

నేటి నగరి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

CNT: నిండ్ర మండలం ఎలకాటూరు గ్రామంలో నేడు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం శనివారం తెలిపింది. ఉదయం 11.15 నిమిషాలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. కూటమి నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

September 22, 2024 / 06:19 AM IST

నేడు రేపల్లెలో పవర్ కట్

BPT: రేపల్లె 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల దృష్ట్యా అదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రేపల్లె పట్టణం, మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

September 22, 2024 / 06:17 AM IST

అంతర్వేది బీచ్‌లో స్వచ్ఛసాగర్-సురక్షిత సాగర్

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం పంచాయతీలో నేషనల్ కోస్టల్ క్లీనింగ్ డే సందర్భంగా శనివారం స్వచ్ఛసాగర్- సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్ టాయ్స్ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, బీచ్ ఇ‌ంఛార్జ్ ఆచార్యుల ఆధ్వర్యంలో బీచ్‌లో ఉన్న ప్లాస్టిక్, పర్యావరణ హానికరమైన ఇతర వ్యర్ధాలను తరలించారు.

September 22, 2024 / 06:17 AM IST

‘జిల్లా వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు’

అల్లూరి: జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శనివారం తెలిపారు. రెండు రోజులు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

September 22, 2024 / 06:17 AM IST

వాడపల్లి వెంకన్నకు రూ.30.01 లక్షలు ఆదాయం

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వేకువజామున నుండి  భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం 3 గంటలు నుండి రాత్రి ఆలయం మూసివేసే వరకూ రూ.30,01,121 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కిషోర్ కుమార్ శనివారం రాత్రి తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు సిబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

September 22, 2024 / 06:15 AM IST

లోన్ యాప్ జోలికి వెల్లవద్దు: ఎస్ఐ

విజయనగరం: లోన్ యాప్‌ల జోలికి వెళ్లవద్దని జగ్గయ్యపేట గ్రామస్థులను వేపాడ ఎస్ఐ బి. దేవి శనివారం హెచ్చరించారు. చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి లోన్‌‌యాప్‌ దురాగతాలకు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజలు, విద్యార్థులు మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్‌ క్రైమ్‌ ఆగడాలు మితిమీరుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

September 22, 2024 / 06:15 AM IST

సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో అదివారం శంకుస్థాపన కార్యక్రమం చేయనున్న సబ్ స్టేషన్ స్థలాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

September 22, 2024 / 06:15 AM IST

‘సచివాలయం ANM ల పై పని ఒత్తిడి తగ్గించాలి’

విజయనగరం: సచివాలయం ANMలపై పని ఒత్తిడి తగ్గించాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ వి.ఇందిర డిమాండ్ చేసారు. ఏఎన్ఎం యూనియన్ నాయకులుతో కలిసి శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయపార్వతికి వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఏఎన్ఎంలు సచివాలయంలో పనులు చేస్తూ, వైద్య శాఖ పనులు చెయ్యడం వలన ఒత్తిడి పెరిగి మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు.

September 22, 2024 / 06:15 AM IST

‘తిరుపతి లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలి’

KRNL: నందవరం మండల కేంద్రంలో స్థానిక దేశాయ్ నెట్వర్క్ కార్యాలయంలో టీడీపీ మండల నాయకులు దేశాయ్ గురు రాజారావు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటపడుతుండటంతో ఆ పార్టీ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు.

September 22, 2024 / 06:14 AM IST