అల్లూరి: జిల్లా వ్యాప్తంగా ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శనివారం తెలిపారు. రెండు రోజులు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.