• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

2 లక్షల విరాళమిచ్చిన ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం

VZM: విజయవాడ వరద బాధితుల కోసం శనివారం స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతి రాజుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్మెంట్‌ అసోసియేషన్‌, విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల విరాళాలన్ని అందజేశారు. ఈ మేరకు చెక్కును ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితుల కోసం ముందుకొచ్చిన పైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలను ఎమ్మెల్యే అభినందించారు.

September 22, 2024 / 05:47 AM IST

ఘనంగా జరిగిన గంగమ్మ తల్లి గ్రామోత్సవం

నెల్లూరు: చేజర్ల గ్రామంలో గత రెండు రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ అభయ గంగమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవము శనివారం తెల్లవారుజాము ఘనంగా జరిగింది. అమ్మవారికి సంగంకు చెందిన పి. రఘు స్వామి సారధ్యంలో అలంకరించిన పూలంకరణ భక్తులకు ఎంతో ఆకట్టుకుంది. గ్రామోత్సవంలో అంకమ్మ తల్లి గ్రామంలో సందర్భముగా భక్తులు ఎంతో భక్తితో ప్రార్థించారు.

September 22, 2024 / 05:47 AM IST

కల్లుకుంట గ్రామాన్ని సందర్శించిన ఎన్డీపీవో

KRNL: పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మపై జరిగిన దాడి నేపథ్యంలో శనివారం ఎమ్మిగనూరు ఎన్డీపీఓ ఉపేంద్ర బాబు గ్రామాన్ని సందర్శించారు. దళిత కాలనీలో పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు పికెట్‌ను తనిఖీ చేసి పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

September 22, 2024 / 05:46 AM IST

సీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంఓ

VZM: గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సీహెచ్సీని జిల్లా సహాయ మలేరియా అధికారి సూర్యనారాయణ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో రికార్డులను పరిశీలించి కొన్ని గ్రామాలలో మలేరియా కేసులను గుర్తించారు. కేసును గుర్తించిన తరువాత చివరిదాకా చికిత్స అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సందిగూడ గ్రామంలో నిర్వహించిన ఏఎల్ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

September 22, 2024 / 05:41 AM IST

పుల్లల చెరువు ఎస్సైగా సంపత్ కుమార్

ప్రకాశం: పుల్లల చెరువు మండలం ఎస్సైగా సంపత్ కుమార్‌ను నియమిస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు. సంపత్ కుమార్ ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌లో విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీలల్లో భాగంగా పుల్లలచెరువుకు రానున్నారు. ప్రస్తుతం పుల్లలచెరువు ఎస్సైగా పనిచేస్తున్న రాజేశ్‌ను ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు.

September 22, 2024 / 05:30 AM IST

బండారులంకలో కొవ్వొత్తుల ర్యాలీ

కోనసీమ: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యిని వాడి కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను గాయపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని అమలాపురం మండలం బండారులంకలో కూటమి నాయకులు శనివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ సునీత, శ్యామ్, పాల్గొన్నారు.

September 22, 2024 / 05:27 AM IST

ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ పోస్టర్ ఆవిష్కరణ

VJM: ఈ నెల 28, 29, 30 తేదీల్లో గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించే భగత్ సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ జయప్రదం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఎస్ఎఫ్ఎ నాయకులతో కలిసి ఆయన ఫెస్ట్ వాల్ పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాడీ బిల్డింగ్ పోటీలతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

September 22, 2024 / 05:27 AM IST

లక్కవరంలో హిందువుల నిరసన

కోనసీమ: మలికిపురం మండలంలోని లక్కవరం గ్రామంలో తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో హిందువులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు.

September 22, 2024 / 05:26 AM IST

పార్వతీపురంలో 24న మెగా జాబ్ మేళా

విజయనగరం: ఈ నెల 24వ తేదీన పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశం మందిరంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలకు అవంతి ఫీడ్స్, అరబిందో ఫార్మా, GMR రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు.

September 22, 2024 / 05:24 AM IST

‘నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

VSP: నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆదేశించారు. పెందుర్తి క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. నేరాలకు సంబంధించి పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. శివారు ప్రాంతాల్లో నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.

September 22, 2024 / 05:17 AM IST

నేడు ఎమ్మెల్యే సత్యప్రభ పర్యటన వివరాలు

తూ.గో: ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ గారి పర్యటన వివరాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు శనివారం తెలియజేశాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో ప్రజా వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడిలో జరిగే గణపతి ఉత్సవాలలో ఆమె పాల్గొంటారు.

September 22, 2024 / 05:13 AM IST

ఆర్థికాభివృద్ధికి ప్రణాళికను రూపొందించండి: కలెక్టర్

KDP: స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047 ఆశయ సాధనలో భాగంగా కడప జిల్లా ఆర్థికాభివృద్ధికి లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో విజన్ ఆంధ్ర@2047 తీసుకురావడం జరిగిందన్నారు.

September 22, 2024 / 05:11 AM IST

ఈ నెల 28న ‘మన ఇల్లు- మన గౌరవం’

పశ్చిమ గోదావరి: జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలు, పట్టణాల్లో ‘మన ఇల్లు- మన గౌరవం’ పేరిట ఈ నెల 28న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు, ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు, ఈవోపీ ఆర్డీలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.

September 22, 2024 / 05:09 AM IST

నేడు నంద్యాల పట్టణంలో ఉచిత వైద్యశిబిరం

నంద్యాల: పట్టణంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యులు రజినీ దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పురుషులకు వీర్యకణాల పరీక్ష, మహిళలకు స్కానింగ్ వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

September 22, 2024 / 05:06 AM IST

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా: విజయవాడ శివారు గొల్లపూడిలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడ దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గొల్లపూడికి చెందిన దినేశ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడకక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు.

September 22, 2024 / 05:05 AM IST