• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీ సీఈవో

సత్యసాయి: గోరంట్లలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో లలితా భాయ్ శనివారం తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన ఆమె కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో రఘునాథ్ గుప్తాతో కలిసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేదించాలని అధికారులను ఆదేశించారు.

September 22, 2024 / 04:40 AM IST

లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

నెల్లూరు: కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారుల చెక్కులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం అందజేశారు. నలుగురు లబ్ధిదారులకు సంబందించిన రూ. 1,30,285ల చెక్కులను వారికి అందజేశారు. త్వరితగతిన సహాయం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

September 22, 2024 / 04:40 AM IST

‘మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయండి’

KDP: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బద్వేల్ సీఐ రాజగోపాల్ అన్నారు. శనివారం బద్వేలులోని రాచపూడి డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణ – పక్షోత్సవాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపవరం సీఐ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

September 22, 2024 / 04:40 AM IST

పారిశుద్ధ్య కార్మికులకు కిట్స్ పంపిణీ

SKLM: సోంపేట మండలం, పలాసపురం, లక్కవరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శనివారం కిట్స్ పంపిణీ చేశారు. ఈ మేరకు స్వచ్ఛత్ హీ సేవా కార్యక్రమంలో భాగంగా పీపీఈ కిట్స్, గ్లెస్, మాస్కులను వారికి అందజేశారు. వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కామేష్, ఎంఎల్‌హెచ్ భారతి, ఏఎన్ఎం విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

September 22, 2024 / 04:39 AM IST

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

కృష్ణా: పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై శనివారం అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని వారు వాహనదారులను హెచ్చరించారు.

September 22, 2024 / 04:39 AM IST

కొండ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి

SKLM: కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం గ్రామంలో ఎర్ర కొండను కొంతమంది అక్రమణదారులు అక్రమించి మొక్కలు నాటడంతో పాటు కంకర తీసి వాటిని విక్రయిస్తున్నారని శనివారం నిమ్మాడలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి స్పందించి కొండను అక్రమించుకున్న వారిపై చర్యలకు ఆదేశించారు.

September 22, 2024 / 04:38 AM IST

రేపు జలవనరుల మంత్రి నిమ్మల రాక

చిత్తూరు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 23న కుప్పం పర్యటనకు విచ్చేయనున్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 23న ఉదయం 11 గంటలకు కుప్పంలోని బ్రాంచ్ కెనాల్ టేక్ ఆఫ్ పాయింట్, కే1 పంపింగ్ హౌస్‌లు తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం చేరుకుని అధికారులతో సమీక్షించనున్నారని తెలిపారు.

September 22, 2024 / 04:37 AM IST

సబ్ జైలును సందర్శించిన జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి

కృష్ణా: నూజివీడు పట్టణంలోని సబ్ జైలును కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ ఎస్.అరుణ సారిక శనివారం పరిశీలించారు. జైలులో ఖైదీలకు అందిస్తున్న వసతి సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతూ, ఖైదీలకు అందించే ఆహారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

September 22, 2024 / 04:33 AM IST

బాధితులకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆర్థిక సాయం

VZM: తెర్లాం మండలం బాధితులకు ఎమ్మెల్యే బేబీ నాయన శనివారం ఆర్థిక సాయం చేశారు. ఏంఆర్ అగ్రహారం గ్రామంలో ఇటీవల రెండు ఆవులు కరెంట్ షాక్‌కు గురై చనిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబి నాయనాపాడి రైతుకు రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తమ్మయ్యవలస గ్రామంలో బొత్స ఈశ్వరమ్మ ఇంటిపై పిడుగు పడి ఇంట్లో ఉన్నసామాన్లు ధ్వంసం అయ్యాయని, రూ. 10వేల ఆర్థిక సహాయం అందజేశారు.

September 22, 2024 / 04:32 AM IST

వచ్చే నెలలో రెండవ బ్లాస్ట్ ఫర్నెస్ ప్రారంభం

విశాఖ: వచ్చే నెలలో స్టీల్ ప్లాంట్ రెండవ బ్లాస్ట్ ఫర్‌నేస్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్లాంట్ ఇంఛార్జ్ సీఎండీ అరుణ్ కాంతి బాగ్చీ తెలిపారు. ఈ నెలాఖరులో ఒక ఫర్నేస్‌లో 7వేల టన్నుల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 18న కేంద్రం నుంచి రూ. ఐదువేల కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు.

September 22, 2024 / 04:32 AM IST

నేడు కుక్కనూరులో మెగా వైద్య శిబిరం

ELR: కుక్కునూరు మండలం శ్రీధర్ గ్రామంలో ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు భద్రాచలం రోటరీ క్లబ్ వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. చిన్నపిల్లలు, ఎముకలు, దంతాలు , కంటి మహిళ వైద్య నిపుణులు సేవలందిస్తారని పేర్కొన్నారు.

September 22, 2024 / 04:31 AM IST

చెత్త తొలగింపు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గంలో పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను జీరో చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి చెందిన నాలుగు ఎకరాల్లో 26 ఏళ్లుగా చెత్తను వేయడంతో టన్నుల కొద్ది పేరుకుపోయిందని తొలగింపు చర్యలు చేపట్టామనరు.

September 22, 2024 / 04:30 AM IST

అల్లినగరంలో రోడ్డు ప్రమాదం

KRNL: అల్లినగరం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మహానందికి చెందిన వెంకటరమణ నంద్యాలలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తన భార్యను చూసేందుకు బైక్ పై నంద్యాలకు వెళ్తుండగా అల్లినగరం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. తీవ్ర గాయాలైన అతణ్ని కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

September 22, 2024 / 04:30 AM IST

బుచ్చిరెడ్డిపాలెంలో నేడు ఎమ్మెల్యే పర్యటన

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

September 22, 2024 / 04:28 AM IST

జగన్‌కు కఠిన శిక్ష పడాల్సిందే: మంత్రి సవిత

సత్యసాయి: జగన్ మెహన్ రెడ్డి అవినీతికి అంతే లేకుండా పోతోందని, చివరికి హిందువుల మనోభావాలు దెబ్బతిసేలా తిరుమల వెంకన్న ప్రసాదం లడ్డూలో కూడా జంతువు కొవ్వు వాడాడని, ఆయనకు కఠిన శిక్ష పడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత డిమాండ్ చేశారు. సోమందేపల్లి మండలంలో మంత్రి మాట్లాడుతూ.. జగన్ రెడ్డి భూ కబ్జాలు, అక్రమ ఇసుక, మైనింగ్‌తో ఇష్టారాజ్యంగా దోచుకున్నాడని మండిపడ్డారు.

September 22, 2024 / 04:27 AM IST