కృష్ణా: ఊటుకూరు శివారు నారాయణపురంలోని తోట చక్రవర్తికి చెందిన ఒంటి నెట్టాడు తాటాకిల్లు శనివారం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ దగ్ధమైంది. దీంతో రూ.3 లక్షలు మేర ఆస్తినష్టం వాటిల్లింది. చక్రవర్తి వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లగా ఆయన భార్య బంగారమ్మ మనవడుని అంగన్వాడీకి తీసుకువెళ్లింది. ఆసమయంలో విద్యుత్తు షార్ట్ సర్య్కూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు వ్యాప్తించాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ELR: తిరుమల వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం తయారీలో అవకతవకలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కోరారు. శనివారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో గన్ని మాట్లాడుతూ.. లడ్డూ వివాదంలో నిందితులను ఉరి తీసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో, వేదమంత్రాల నడుమ ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.
WG: భీమవరంలో కొలువైన శ్రీశ్రీ మావుళ్లమ్మకు పట్టణానికి చెందిన శ్రీనివాస రోహిత్ 6 గ్రాములు బంగారం, అచ్యుతరామరాజు 2 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి పాల్గొన్నారు.
WG: తిరుమల పవిత్రతను కాపాడాలంటూ భీమవరం పట్టణంలోని గునుపూడి గ్రామానికి చెందిన బ్రాహ్మణ సమైక్య నాయకులు నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు చెరుకుపల్లి సంతోశ్ మాట్లాడుతూ.. తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగించే లాగా వ్యవహరిస్తున్నారని, పూర్తి విచారం చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
W.G: భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి ఆయనను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ అహంకార ధోరణిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం నిడదవోలులో నిరసన చేపట్టారు. కాళ్ల మండలం ఏలూరుపాడులో అంబేడ్కర్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీని ఎమ్మెల్యే చింపడంపై ఆయన ధ్వజమెత్తారు.
TPT: తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో రాష్ట్రస్థాయి అండర్-14 బాల, బాలికల జూడో పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ ఎస్.బాబు తెలిపారు. ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. 24న ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.
CTR: పిచ్చాటూరు మండలం వెంగళత్తూరులో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా శనివారం సాయంత్రం గణనాథునికి పంచామృతములతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామి వారికి ప్రీతిపాత్రమైన గరిక మాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ధూపదీప నైవేద్యములు సమర్పించి పంచహారతులు అందజేశారు.
PLD: నేడు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాలలో పర్యటించనున్నారని మండల స్థాయి నాయకులు శనివారం తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మండలంలోని కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
KDP: ఆదివారం ఉదయం 9 గంటలకు ఒంటిమిట్ట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు అకేపాటి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పీఏ మారుతి ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఏలూరు: ఆముదల అప్పలస్వామి కాలనీ ప్రాంతంలో ఈ నెల 22న గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఏలూరు పవర్ పేటలో ఉన్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో ఆదివారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజన్ తెలిపారు. సాయంత్రం 4గం నుంచి నిమజ్జనం ఊరేగింపు పూర్తి అయ్యే వరకు ఆముదల అప్పలస్వామి కాలనీ, మహేశ్వర కాలనీలో సరఫరా ఉండదన్నారు.
CTR: చిన్నగొట్టిగల్లు మండలం నెల్లెట్లువారిపల్లి పంచాయతీ బొమ్మాయిచెరుపల్లిలో ఆదివారం జరగబోయే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రానున్నారని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ మురళి, నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: విజయవాడ వరదలలో వాహనాలకు జరిగిన నష్టానికి బీమా సెటిల్మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 10 వేల వాహనాలలో 6 వేల వాహనాలకు బీమా సెటిల్మెంట్ పూర్తైందని అధికారులు సీఎంకు శనివారం జరిగిన సమీక్షలో తెలిపారు. మిగతా 4 వేల వాహనాలకు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయాలని చంద్రబాబు సూచించారు.
నెల్లూరు: జిల్లా కేంద్రంలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల క్రీడలు శనివారంతో ముగిశాయి. ఈ క్రీడలలో పలు జిల్లాల నుంచి ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకి ఎస్.ఈ వి.విజయన్ బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏర్పాట్లు చేసిన నెల్లూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
KRNL: కేంద్ర ప్రభుత్వ పథకాలను కర్నూలు జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ. భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.