చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రభుత్వం హస్తం ఉందని సీఐడీ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ జారీ చేసింది.
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. అయితే మరో పిటిషన్లో కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
ఏపీలోని తిరుపతి జిల్లా(tirupati district)లో కలుషితమైన ప్రసాదం స్వీకరించి 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఆ క్రమంలో విషయం తెలుసుకున్న వైద్యాధికారులు వారికి చికిత్స చేశారు. అయితే వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీలోని గాంధీజీ సమాధి రాజ్ ఘాట్ వద్ద టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సహా పలువురు మాజీ ఎంపీలు కలిసి మౌనదీక్ష చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.
ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు.
చంద్రబాబు అరెస్ట్ విషయంపై లోక్‌సభలో చర్చ సాగింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం సాగింది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స జరుగుతోంది.
తిరుపతిలో వైసీపీ సర్కార్, టీటీడీ సంయుక్తంగా చేపట్టిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను సీఎం జగన్ ప్రారంభించారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు మరణించడంతో విషాదఛాయలు అలముకున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ వాతావరణ శాఖ పలు జిల్లాలను హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నారా భువనేశ్వరిపై పోసాని కృష్ణమురళి ఫైరయ్యారు. మీ నాన్న (ఎన్టీఆర్)పై చంద్రబాబు చెప్పులు వేయించింది కూడా ప్రజల బాగోగుల కోసమేనా అని సెటైర్లు వేశారు.