SKLM: కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురం గ్రామంలో ఎర్ర కొండను కొంతమంది అక్రమణదారులు అక్రమించి మొక్కలు నాటడంతో పాటు కంకర తీసి వాటిని విక్రయిస్తున్నారని శనివారం నిమ్మాడలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి స్పందించి కొండను అక్రమించుకున్న వారిపై చర్యలకు ఆదేశించారు.