కోనసీమ: జిల్లా వ్యాప్తంగా కొబ్బరి ధర భారీగా పెరిగింది. ఒక్కొక్క కొబ్బరికాయ రూ.10లు ఉండే ధర రూ.14.50 పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పండుగ విజయదశమి కావడంతో ఈ ధర వచ్చిందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. భారీగా ఎగుమతులు కొనసాగడంతో వ్యాపారస్తులు కొబ్బరికాయ కొనేందుకు పోటీ పడుతున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల: కోవెలకుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రైలు ఢీకొని ఓ వృద్ధుడు చనిపోయిన విషయం తెలిసిందే. మృతుడు కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడికి చెందిన దండే సూర్యనారాయణ (60)గా గుర్తించారు. సౌదరదిన్నెలో బంధువుల ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా రైలు కిందపడి చనిపోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు: బుచ్చి పట్టణంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదివారం పర్యటించారు. నగర పంచాయతీ కార్యాలయం పనులను ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో నగర పంచాయతీ కార్యాలయం అసంపూర్తిగా మిగిలింది అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పనులను పునం: ప్రారంభించామని తెలిపారు. ఆరు నెలల్లో నగర పంచాయతీ కార్యాలయం పూర్తి చేస్తామని వెల్లడించారు.
SRKL: సరుబుజ్జిలి మండలం దంతావరపు కోట నుంచి అక్రమంగా సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలలో మట్టిని తరలిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా అక్రమంగా మట్టిని తెచ్చి ఇల్లు నిర్మాణాలు చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్ విలువ రూ.1500 వరకు ఉంటుంది. పైసా ఖర్చు లేకుండా గుత్తేదారులు వేల సంఖ్యలో సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రకాశం: చిన్నగంజాం మండలం జీడిచెట్లపాలెం హైవే వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పోలీసుల వివరాల ప్రకారం.. జీడిచెట్లపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన హైవే పోలీసులు, హైవే అంబులెన్స్‌లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించాలనే సంకల్పంతో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన శుద్ధజల పథకం సేవలు గ్రామస్థులకు చేరువయ్యాయి. యద్దనపూడి మండలం వింజనంపాడులో కొద్ది రోజులగా నిలిచిపోయిన పథకం నిర్వహణ ఉప సర్పంచి సాదినేని రంగారావు నేతృత్వంలో ప్రారంభించారు. సుమారు రూ. లక్ష నిర్వహణ వ్యయాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహకారంతో దీనిని ప్రారంభించారు.
కాకినాడ: ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బంకమట్టితో శివలింగాల తయారీ కార్యక్రమం ప్రారంభమైంది. తుని పట్టణంలోనే బెల్లపువీధిలో ఉన్న ఆర్యవైశ్య భవనంలో వ్యాపారవేత్త చెక్కా తాతబాబు, మాజీ ఛైర్ పర్సన్ శోభారాణి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు. కోటి శివలింగాల తయారీ కార్యక్రమంలో భాగంగా 15 రోజులులో 5 లక్షలు శివలింగాలు తయారు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
SRKL: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం డోలపేట గ్రామంలో ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో పరిసరాలను NSS స్టూడెంట్స్, గ్రామస్తులు కలిసి పరిశుభ్రం చేశారు. మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్య్రమే కాక స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు అని వారు అన్నారు.
SRKL: పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఈరోజు ఉదయం తోపులాట చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌కు సిబ్బందికి మధ్యలో జరిగిన లావాదేవీలు వివాదాస్పదంగా మారాయి. దీంతో టోల్గేట్ సిబ్బంది లారీ డ్రైవర్‌పై జూలుం ప్రదర్శించారు. దీంతో లారీ డ్రైవర్లు వాహనాలను టోల్గేట్ పైనే నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రకాశం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 23 మంది మున్సిపల్ కమిషనర్లను శనివారం బదిలీ చేస్తూ పురపాలక శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల జారీ చేశారు. దీనిలో భాగంగా అద్దంకి మండలం, అద్దంకి మున్సిపల్ కమిషనర్‌గా డి. రవీంద్రను నియమించినట్లు పురపాలక శాఖ వెలువరించిన ఉత్తర్వులలో (GORT 723)లో పేర్కొనడం జరిగింది.
ELR: ఏలూరు జిల్లాలో పెదవేగిలో అత్యధికంగా 40.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, లింగపాలెంలో 1.2 మిల్లిమీటర్ల అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. బుట్టాయిగూడెం 37.2, ఉంగుటూరు 23.0, కొయ్యలగూడెం 17.4, ద్వారకాతిరుమల 16.2, జంగారెడ్డిగూడెం 13.6, భీమడోలు 10.8, పోలవరం 9.0, ముసునూరు 8.6, ఏలూరు రూరల్ 8.2, ఏలూరు అర్బన్ 8.0, నూజివీడు 7.2, పెదపాడు 6.6 నమోదయిందని తెలిపారు.
SRKL: పొందూరు మండలంలోని తోలాపి గ్రామంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి స్టిక్కర్ అంటించారు. పింఛన్ రూ. వెయ్యి పెంపు, రూ.5 కే అన్న క్యాంటీన్ భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక వంటి మంచి పథకాలు అందిస్తున్న మన ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించారు.
GNTR: ‘స్వచ్ఛతా హీ’ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం గుంటూరు నగరంలో సైక్లోథాన్ జరిగింది. కలెక్టర్ నాగలక్ష్మీ అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ సతీశ్ కుమార్, జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెరేడ్ గ్రౌండ్స్ నుంచి నగరంపాలెం, హిందూ కాలేజ్, కొరిటెపాడు, గుజ్జనగుండ్ల, మీదుగా ర్యాలీ గ్రౌండ్‌కు చేరింది.
SKLM: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని బాబా నగర్, ఈశ్వర్ నారాయణ, తదితర కాలనీలలో ఆదివారం ఉదయం కుళాయిల నుండి బురద నీరు రావడంతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి నీరు తాగితే అనారోగ్యం పాలు అవుతామని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.
ATP: శాంతి భద్రతలే లక్ష్యంగా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం మురడి గ్రామంలో సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామాల్లో శాంతిభద్రతలు నెలకొల్పడమే లక్ష్యంగా పాత నేరస్తులు, అనుమానితుల ఇల్లు, అక్రమ మద్యం అమ్ముతున్న నివాసాలలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా మెలగాలని పేర్కొన్నారు.