విజయనగరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం తెర్లాం మండం కుమ్మరిపేట గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ముచ్చభాస్కర రావు అధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వంద రోజుల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.
KDP: కళ్ళు కనపడక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు కంటి చూపు అందించడమే లక్ష్యమని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట ZP హైస్కూల్లో ఆకేపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
KDP: పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న విజయ హోమ్స్‌లోని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు హరి నివాసంలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ చోరీలో సుమారు రూ.కోటి నగదును దుండగులు అపహరించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ జీవన్ గంగానాథ్ బాబుతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ప్రకాశం: దోర్నాల మండలంలోని అయిన మొక్కల గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆదివారం రహదారిపై ముల్లకంచవేసి బిందెల పట్టుకొని నిరసన తెలియజేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో నీటి సమస్య తలెత్తిందని ఉన్నతాధికారులు చొరవ చూపి నీటి సమస్య పరిష్కరించాలని ప్రజల కోరుతున్నారు.
కృష్ణా జిల్లా: నూజివీడు పట్టణంలోని ద్వారక ఎస్టేట్ ఆవరణంలో ఆదివారం వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన వంద రోజులలో గోరి కట్టిందన్నారు. లడ్డూ, పడవలు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.
ప్రకాశం: టంగుటూరు మండలంలోని గొల్లూరమ్మ దేవస్థాన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వడ్లపూడి గ్రామం, గుంటూరు జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రం మధురైకు అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
KDP: కదిరి వ్యవసాయ పరిశోధనా సంస్థ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి (86) ఆదివారం తెల్లవారుజామున ప్రొద్దుటూరులో మృతి చెందారు. తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. వేరుశనగలో రెండు రకాల కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంలో ఆ బృందానికి నాయకత్వం వహించారు.
BPT: ఇటీవల వరదల కారణంగా పంట దెబ్బతిన్న రైతులు వెంటనే పంట నష్టాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. పంట నష్టం నమోదు ఆదివారం చివరి రోజు కావడంతో రైతులు వేమూరు నియోజకవర్గంలోని మండలాలలో అగ్రికల్చర్ ఆఫీసర్, క్షేత్ర సహాయకులను సంప్రదించి వెంటనే పంట నష్టం నమోదు చేయించుకోవాలన్నారు.
KKD: పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గామాత దేవి నవరాత్రుల మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రత్తిపాడు పార్టీ కార్యాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే సత్యప్రభ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
KRNL: జిల్లాకు విచ్చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును స్టెట్ గెస్ట్ హౌస్‌లో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పుష్ప గుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో హంద్రీ నీవా ద్వారా చెరువులకు నీళ్ళు నింపాలని, అలాగే అలగనూరు రిజర్వాయరు మరమ్మత్తులు, గుండ్రేవుల రిజర్వాయరు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
తూ.గో: కొయ్యలగూడెం మండలానికి చెందిన వెంకట్రావు (60) మృతదేహం కొవ్వూరు టౌన్ పరిధిలోని భక్తాంజనేయ స్నాన ఘట్టం వద్ద శనివారం లభ్యమయిందని టౌన్ ఎస్సై జగన్మోహన్ శనివారం తెలిపారు. మృతుడు ఈనెల 20న వైద్యం కోసం రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి రాలేదని అతని కుమారుడు రాంబాబు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టామని ఎస్సై తెలిపారు.
ATP: గుత్తి మండలం అబ్బేదొడ్డిలో భార్యపై భర్త దాడి చేశాడు. గ్రామానికి చెందిన సుమలత, ఆమె భర్త గోపాల్ మధ్య శనివారం రాత్రి చిన్నపాటి విషయంపై గొడవ ప్రారంభమైంది. కోపంతో గోపాల్ భార్యపై దాడి చేశాడు. స్థానికులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేశారు.
KKD: రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసం వద్ద వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3 లక్షల రూపాయలు చెక్‌ను మహమ్మద్ కాజ ముహుద్దీన్‌కు ఎమ్మెల్యే అందజేశారు. 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు.
ప్రకాశం: మార్కాపురంలో అనుమానాస్పదంగా తిరుగుతూ కనబడిన వ్యక్తిని మార్కాపురం ఎస్సై సైదుబాబు అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారణ చేయగా.. సదరు వ్యక్తిది సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి గ్రామానికి చెందిన శేషమ్మ కుమారుడు శ్రీహరిగా గుర్తించారు. 20 సంవత్సరాల కిందట తప్పిపోయిన అతను తన కుమారుడేనని తల్లి తెలిపింది. ఇన్నేళ్ల తర్వాత తమ కుమారుడి ఆచూకీ లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కతజ్ఞతలు తెలి...
శ్రీకాకుళం: ఆమదాలవలస ప్రధాన రహదారిలో వాకలవలస వద్ద ఆటో ముందు చక్రం రహదారి గోతిలో దిగి విరిగి పోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ముందు చక్రం విరిగిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఐతే ఆటో బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు. రహదారి సరిగా లేకనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.