చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, పీటీ వారెంట్‌పై ముందస్తు బెయిల్ విచారణను నవంబర్ 7వ తేదికి వాయిదా వేసింది.
ఏపీలో దసరా సెలవు రోజును మార్చుతూ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయదశమి రోజును అక్టోబర్ 24వ తేది మార్చుతూ ఆ రోజున సెలవుదినంగా ప్రకటించింది. దీంతో రెండు రోజుల పాటు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడనున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఐదో విడదతను చేపట్టనున్నారు. ఈసారి యాత్రలో రైతు సమస్యల పరిష్కారం దిశగా పోరాటం సాగించనున్నారు. అలాగే సీఎం జగన్ టార్గెట్‌గా పవన్ ముందుకెళ్లనున్నారు.
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ తాళం వేసింది
టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోనికి తీసుకుని.. ఆరోజు రాత్రి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు కూడా గృహనిర్భంధంలో ఉంచారు. తల్లి వర్ధంతి ఉందని చెప్పిన వినిపించుకోకుండా ఇబ్బందిపెట్టారు. రవీంద్ర విషయంలో ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ లేదని చెప్పడంతో చేసేదేమీ లేక వారు బైక్‌పై ఇంటికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. క్వాష్ పిటిషన్ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఇటు జైలులో న్యాయవాదుల ములాఖత్‌ను కూడా జైలు అధికారులు తగ్గించారు.
పుష్పగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్షేత్రం వద్ద వజ్రాలు దొరికాయనే ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. క్షేత్రం చుట్టూ వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలంతా తమ పిల్లలేనని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. బాధలో ఉన్న తల్లిని కలిసేందుకు వచ్చే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు.
మార్గదర్శిలో వాటాలకు సంబంధించిన వివాదంలో సీఐడీ దాఖలు చేసిన కేసులను కొట్టివేయాలంటూ రామోజీరావు పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది
కులం చూసి కాదు.. అభివృద్ధిని చూసి ఓటేయాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు.
మార్గదర్శి సంస్థ విషయంలో మరో చీటింగ్ కేసు నమోదైంది. రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి తన వాటాను ఆయన కోడలు శైలజా కిరణ్‌పై రాయించారని మాజీ షేర్ హోల్డర్ గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు చేశారు.
అక్రమాలకు, అవినీతికి పాలుపడ్డారు కాబట్టే చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. జనసేన అధ్యక్షుడికి చంద్రబాబు అంటే ఇష్టం లేదని, ఆయన పోతే పార్టీని లాక్కుందామనే ఆలోచనలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు విచారణలో భాగంగా నేడు కిలారు రాజేష్‌ను సీఐడీ అధికారులు విచారించారు. రేపు కూడా విచారణకు హాజరు కావాలని తెలిపారు.