కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం విశాఖపట్నం వాస్తవ్యులు రాయవరపు సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు భారీ విరాళం అందజేశారు. వాడపల్లి గ్రామంలో నూతనంగా చేపట్టబోయే 500 రూమ్‌ల విశ్రాంత గదులకు ప్రథమంగా ఒక రూమ్‌కు రూ. 15, 31, 000 దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా దాతలను ఘనంగా ఆలయ ఈఓ సత్కరించారు.
కృష్ణా: కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చదివే డిగ్రీ విద్యార్థులు(2024-25విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అక్టోబర్ 14లోపు అపరాధ రుసుము లేకుండా నిర్ణీత ఫీజు చెల్లించాలని, ఈ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది.
GNTR: మూడు రాజధానుల ఉద్యమంలో పాల్గొన్న కూలీలకు డబ్బులు ఇవ్వలేదంటూ… మాదిగ ఆర్థికాభివృద్ధి చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బేతపూడి సాంబయ్య ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో నందిగం సురేష్ రాజ్యంగం అమలు అయిందని అన్నారు. మంగళగిరిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.10 నుంచి 15 లక్షల వరకు కూలీలకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
VSP: సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్నకు ఆదివారం ఘనంగా స్వర్ణపుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతఃకాల పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా గోవిందరాజస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపం వేదికపై అధిష్టింపజేశారు.
GNTR: YCP ప్రభుత్వం అంటేనే స్కాం ప్రభుత్వమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆదివారం ఆమె మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో మొదటి 100 రోజుల్లో చేసింది కేవలం రూ.250 పెన్షన్ పెంచడమే అన్నారు. జగన్ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు గడపలు దాటవని దుయ్యబట్టారు.
బాపట్ల: కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో శనివారం జరిగిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో అధికారులు ఏకపక్ష ధోరణితో దారుణంగా విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అధికారులు స్థానిక ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులకు మరియు అధికార పార్టీకి చెందిన వారికి సమాచారం లేకుండా వైసీపీ చెందిన వారితో సభ నిర్వహించటం పట్ల టీడీపి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
TPT: తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా వంట మనిషి పోస్టులకు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటనలో పేర్కొన్నారు.మొత్తం 3 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఎనిమిదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులన్నారు.https://www.svvedicuniversity.ac .in/ వెబ్ సైట్ చూడగలరు.
శ్రీకాకుళం: రోడ్డులో అంతకాపల్లి గ్రామ సమీపంలో ఓ మామిడి తోటలో మరడాన శివ (25) అనే యువకుడు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఉద్దవోలు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వివరాలు తెలియాల్సి ఉంది.
KKD: కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా శ్రీహరి రాజు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. డిఎస్పీగా సేవలు అందించిన లతా కుమారి విజయవాడకు బదిలీ కావడంతో… రాష్ట్ర ప్రభుత్వం నూతన డిఎస్పీగా శ్రీహరి రాజును నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అందరి సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
TPT: తిరుపతి పట్టణంలోని పద్మావతిపురంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుని భూమనపై ఆరోపణ చేస్తున్నారని చెప్పారు. తమ హయాంలో ఏ రకమైన కల్తీ జరగలేదని చెప్పారు. తమపై చేసిన ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమని చాలెంజ్ విసిరారు.
మన్యం: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27వ తేదీన సీతంపేట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ 5D థియేటర్‌ను ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆదివారంవీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.
GNTR: గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మస్తాన్ వలీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
AKP: జిల్లాలోని ఎన్టీఆర్ మార్కెట్ ఆవరణలో యూనియన్ బ్యాంక్ అధికారులు సిబ్బంది ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంపై ఆదివారం ఉదయం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో రహదారులను శుభ్రం చేశారు. లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.
కృష్ణా: వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందిస్తూ.. లక్షల మంది రైతులు, కూలీలకు ఆసరాగా నిలుస్తూ.. కృష్ణ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్న బందరు కాలువను ఆక్రమణలు చుట్టుముడుతున్నాయి. ఎగువన విజయవాడలోని కొందరు కాలువలో అక్రమంగా ఇళ్లు, అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాల నిర్మాణాలను చేపడుతూ.. సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నారు.
KRNL: కర్నూలు అర్బన్‌లోని 41వ వార్డు పరిమళ నగర్, 35వ వార్డు కర్నూల్ ఎస్టేట్‌లో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె వడ్డించి, ఆ తర్వాత భోజనం చేశారు. అనంతరం చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.