కృష్ణా: వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందిస్తూ.. లక్షల మంది రైతులు, కూలీలకు ఆసరాగా నిలుస్తూ.. కృష్ణ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్న బందరు కాలువను ఆక్రమణలు చుట్టుముడుతున్నాయి. ఎగువన విజయవాడలోని కొందరు కాలువలో అక్రమంగా ఇళ్లు, అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాల నిర్మాణాలను చేపడుతూ.. సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నారు.